AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: ఎన్నికల కమిషన్ కు చిక్కకుండా తెరచాటు ప్రచారం.. సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్న నాయకులు..

ఎన్నికల ప్రచారం కరపత్రాలు నుంచి కార్పొరేట్ స్థాయికి చేరుకుంది. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు ఇవి సాధారణం. వీటి కంటే ఎక్కువగా సోషల్ మీడియాపై దృష్టి పెట్టి అత్యధికంగా ఖర్చు చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ రాడార్లోకి రాకుండా రాజకీయ పార్టీలు వందల కోట్లు కుమ్మరిస్తున్నాయి. నేరుగా జరిపే ప్రచారం కంటే సోషల్ మీడియా డిజిటల్ ప్రచారాలే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

Telangana Elections: ఎన్నికల కమిషన్ కు చిక్కకుండా తెరచాటు ప్రచారం.. సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్న నాయకులు..
Politicians are campaigning on social media to avoid the Election Commission's radar
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Nov 23, 2023 | 11:03 AM

Share

ఎన్నికల ప్రచారం కరపత్రాలు నుంచి కార్పొరేట్ స్థాయికి చేరుకుంది. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు ఇవి సాధారణం. వీటి కంటే ఎక్కువగా సోషల్ మీడియాపై దృష్టి పెట్టి అత్యధికంగా ఖర్చు చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ రాడార్లోకి రాకుండా రాజకీయ పార్టీలు వందల కోట్లు కుమ్మరిస్తున్నాయి. నేరుగా జరిపే ప్రచారం కంటే సోషల్ మీడియా డిజిటల్ ప్రచారాలే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. రకరకాల పాటలు, కామెడీ స్కిట్లు, సెలబ్రిటీలతో స్టేట్మెంట్లు, కొన్ని పార్టీలు అయితే సోషల్ మీడియా ప్రభావితం చేసే వ్యక్తులతో స్టెప్పులు కూడా వేయిస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థికి 40 లక్షలు మాత్రమే ప్రచారం కోసం ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉంది. ప్రచారం కోసం వాడే జెండాలు, హోర్డింగులు, టీవీ, పేపర్ అడ్వటైజ్మెంట్లతో కలిపి 40 లక్షలు దాటకూడదు. సభలు సమావేశాలు ఖర్చు కూడా ఇందులోనే ఉంటుంది. ఎన్నికల తర్వాత పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తమ ఎక్స్పెండిచర్ వివరాలను ఎన్నికల కమిషన్ కు సమర్పించాలి.

నిజానికి 40 లక్షల్లో ఏ అభ్యర్థి కూడా ప్రచారం ముగించలేడు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇండిపెండెంట్ కూడా అంతకంటే ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ రాడార్కు దొరక్కుండా రకరకాల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అందులో ప్రధానమైనది సోషల్ మీడియా. ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రముఖంగా గూగుల్ యాడ్స్, యూట్యూబ్ లో కనిపిస్తున్నాయి. ఏ వీడియో చూసినా ముందుగా రాజకీయ పార్టీల యాడ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. ఇందుకు భారీ ఎత్తున ఖర్చు పెడుతున్న ఆయా పార్టీలు తమకున్న ఎన్నారైలను వినియోగించి అక్కడ నుంచి యాడ్స్ పబ్లిష్ చేయిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ దీన్ని లెక్కలోకి తీసుకుందామనుకున్నా ఆ ఖర్చు వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ఇక మరోవైపు సెలబ్రిటీ అకౌంట్స్ పై దృష్టిపెడుతున్నాయి. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో కనీసం 10,000 ఫాలోవర్స్ ఉన్న ఏ కౌంట్లనీ రాజకీయ పార్టీలు వదలడం లేదు. అన్నింటినీ ప్రచార వేదికలుగా వాడుకుంటున్నాయి.

ఈ సెలబ్రిటీస్ కి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తమకు అనుకూలంగా యాడ్స్, స్టేట్మెంట్స్ పోస్ట్ చేయిస్తున్నారు. కొంతమంది నటులతో చిన్న చిన్న వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. వీరికి చెల్లిస్తున్న పేమెంట్ ఎక్కడ బయటకు రాదు. ఎలక్షన్ కమిషన్ ఎంక్వయిరీ చేసినా.. తామే ఆ పార్టీలోని ఫలానా అభ్యర్థి పై అభిమానంతో వీడియోలు చేస్తున్నామని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా