Telangana Politics: కేసీఆర్ చేసిన ఒక్క కామెంట్.. బీజేపీ-టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం..!
Telangana Politics: కేసీఆర్ చేసిన ఒక్క కామెంట్, పెద్ద దుమారమే రేపుతోంది. బీజేపీ-టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధాని దారితీసింది. దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు బీజం వేశారు..
Telangana Politics: కేసీఆర్ చేసిన ఒక్క కామెంట్, పెద్ద దుమారమే రేపుతోంది. బీజేపీ-టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధాని దారితీసింది. దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు బీజం వేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. భారత రాజ్యాంగాన్ని కొత్తగా రాసుకోవాలంటూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీజేపీ కీలక నేతలు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కేసీఆర్, రాజ్యాంగాన్నే అవమానించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
కేసీఆర్ కామెంట్స్‌పై అటు కాంగ్రెస్ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ కల సాకారమైందని గుర్తుచేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అయితే, కేసీఆర్ వ్యాఖ్యల్ని వక్రీకరించి.. కాంగ్రెస్, బీజేపీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అంటున్నారు టీఆర్‌ఎస్ నేతలు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి దళితులను అణగదొక్కిన పార్టీలు, ఇప్పుడు అంబేద్కర్‌పై గౌరవాన్ని నటిస్తున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణలో పొలిటికల్ మంటలు రాజేసిన కొత్త రాజ్యాంగం రగడ ఏ టర్న్ తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది.\
Also read:
IIT Jobs 2022: బీటెక్/ఎంటెక్ నిరుద్యోగులకు తీపికబురు.. రూ.31,000ల జీతంతో ఉద్యోగాలు.. గడువు 2 రోజులే!
Viral Video: పోర్చుగీసులో కచ్చా బాదం సాంగ్ హల్‌చల్.. అదిరిపోయే స్టెప్పులేసిన తండ్రీకూతురు.. వీడియో
RBI Recruitment 2022: ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. చివరి తేదీ ఎప్పుడంటే..