Viral Video: పోర్చుగీసులో కచ్చా బాదం సాంగ్ హల్‌చల్.. అదిరిపోయే స్టెప్పులేసిన తండ్రీకూతురు.. వీడియో
Kacha Badam Song: సోషల్ మీడియాలో బెంగాలీ పాట 'కచ్చా బాదం' తెగ హల్ చల్ చేస్తోంది. ఈ పాటకు పలువురు సెలబ్రిటీలు, కొంతమంది నెటిజన్లు డ్యాన్సులు వేస్తూ..
Kacha Badam Song: సోషల్ మీడియాలో బెంగాలీ పాట ‘కచ్చా బాదం’ తెగ హల్ చల్ చేస్తోంది. ఈ పాటకు పలువురు సెలబ్రిటీలు, కొంతమంది నెటిజన్లు డ్యాన్సులు వేస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నారు. సరికొత్తగా రీల్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా లక్షలాది వ్యూస్ కూడా సంపాదిస్తున్నారు. సాధారణ యూజర్ల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కచ్చా బాదం (Kacha Badam) పాటకు పర్ఫామెన్స్ చేస్తుండటంతో ఈ పాట దాదాపు నెలకు పైగా నెట్టింట (Social Media) ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట యూజర్లకు అర్ధం కాకపోయినప్పటికీ.. తెగ ఆకట్టుకుంటోంది. కచ్చా బాదమ్ పాట సాహిత్యం వింటుంటే.. మనకు కూడా స్టెప్పులు వేయాలనిపిస్తుంది. అందుకే ఈ పాట ఇంకా ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది.
తాజాగా.. పోర్చుగీసుకు చెందిన ఓ తండ్రి, కుమార్తె ఈ పాటకు డ్యాన్స్ చేశారు. కచ్చా బాదం పాటకు ఇద్దరూ స్టెప్పులేసి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో ఈ వీడియోకు కేవలం కొన్ని గంటల్లోనే 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వారికి సాహిత్యం అర్ధం కాకపోయినా.. వారు కూడా డ్యాన్స్ వేశారంటే.. కచ్చా బాదం పాటకే ఎంతలా క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక తండ్రి, కుమార్తె కచా బాదంకి డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగా హల్‌చల్ చేస్తోంది. చాలామంది నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లుచేస్తున్నారు.
వైరల్ వీడియో..
View this post on Instagram
వేరుశెనగల గురించి ఓ చిరు వ్యాపారి పాడిన ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వేరుశెనగ అమ్ముకునే వ్యాపారి భువన బాద్యాకర్ (Bhuvana Badyakar)ఈ పాట పాడారు.
Also Read: