Viral Video: కళాకారుడి చేతిలో జీవం పోసుకున్న పులి.. దేనితో చేశాడో వీడియో చూస్తేగానీ మీరు నమ్మలేరు..
మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్ అయితే, మీరు అమౌరీ గుయిచోన్ అనే ప్రసిద్ధ పేస్ట్రీ చెఫ్ పేజీని చూసి ఉండవచ్చు...
మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్ అయితే, మీరు అమౌరీ గుయిచోన్ అనే ప్రసిద్ధ పేస్ట్రీ చెఫ్ పేజీని చూసి ఉండవచ్చు. అతను పేస్ట్రీ డిజైన్‌లు, చాక్లెట్ డిజైన్ ప్రసిద్ధి చెందిన స్విస్-ఫ్రెంచ్ పేస్ట్రీ చెఫ్. ఈసారి అతను పులి ఆకారంలో చాక్లెట్ తయారు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇది చైనీస్ న్యూ ఇయర్ రోజైన చంద్ర నూతన సంవత్సరానికి గుర్తుగా తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పులి ముఖం నుండి దాని చెవులు, తోక, పాదాల వరకు – ప్రతిదీ అసలు పులి పిల్ల వలె వాస్తవికంగా కనిపిస్తుంది. అతను పులి ఆకారంపై తినదగిన పెయింట్‌ను స్ప్రే చేశాడు. వీడియో ముగిసే సమయానికి, వీక్షకులు పెద్ద పులి, చిన్న పిల్లను చాక్లెట్‌తో తయారు చేశాడు. ఈ వీడియో “చాక్లెట్ టైగర్! అని క్యాప్షన్ కూడా పెట్టారు. చంద్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు! ” కూడా తెలిపాడు.
View this post on Instagram
Read Also.. Viral Video: దొంగలకు రివర్స్ ఝలక్ ఇచ్చిన షాపు యజమాని.. మరి ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..!