Khammam Politics: క్షమాపణ చెప్పు, లేదంటే.. ఖమ్మంలో కాకరేపుతున్న వార్నింగ్ లెటర్..
ఖమ్మంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వార్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. మాటల్ని దాటుకొని వార్నింగ్‌ల వరకూ వచ్చింది సీన్. పొంగులేటి వర్గానికైతే ఏకంగా బెదిరింపులే వచ్చాయ్!. మంత్రి పువ్వాడను ఏమన్నా అంటే అంతు చూస్తామంటూ లేఖలు రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది.

ఖమ్మం, జులై 01: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం కాకరేపుతోంది. కాంగ్రెస్ జనగర్జన సభకు ముందే ఖమ్మంలో రాజకీయం హీటెక్కిపోతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లీడర్ల మధ్య మాటల తూటాలు సెగలు రేపుతున్నాయి. ఆరోపణలు-విమర్శలు, సవాళ్లు-ప్రతి సవాళ్లు దాటుకొని బెదిరింపులు, వార్నింగ్‌ల వరకూ వచ్చింది పరిస్థితి. బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తోన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి డైరెక్ట్ వార్నింగే ఇచ్చింది మంత్రి పువ్వాడ అజయ్ వర్గం. క్షమాపణ చెప్పు, లేదంటే శవాలు కూడా దొరకవంటూ లెటర్ రిలీజ్ చేశారు. ఈ లేఖ ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బెదిరింపులకు భయపడేదేలే అంటున్నారు పొంగులేటి. రాహుల్ సభను అడ్డుకోవడానికే ఈ కుట్రలు అన్నారు. బీఆర్‌ఎస్ చేస్తోన్న అరాచకాలకు ప్రజలే బుద్ధి చెబుతారంటున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గానీ, తనకు గానీ ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు పొంగులేటి ప్రధాన అనుచరుడు మువ్వా విజయ్‌బాబు. రేవంత్‌రెడ్డి, పొంగులేటిపై నిప్పులు చెరిగారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదంటూ హెచ్చరించారు.
పొంగులేటిపై ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రేగా కాంతారావు. నీతిమాలిన రాజకీయంచేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టను బిడ్డా అంటూ వార్నింగ్ ఇచ్చారు. నేను రంగంలోకి దిగితే కథ వేరే లెక్క ఉంటాది, తొక్కితే పాతాళానికి పోతారంటూ సినీ స్టైల్లో ట్వీట్స్ వదిలారు రేగా. మొత్తానికి ఉమ్మడి ఖమ్మంలో రాజకీయాలు కాకరేపుతున్నాయ్!. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య డైలాగ్స్… తూటాల్లా పేలుతున్నాయ్!. రాహుల్ సభకి ముందే పరిస్థితి ఇలా ఉందంటే, మరి రేపు సభ తర్వాత సీన్ ఎలాగుంటుందో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
