Advocates Murder: హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్య.. పోలీసుల అదుపులో నిందితులు.. కీలక విషయాలు వెల్లడి..

High Court Advocates Murder: పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు న్యాయవాదుల హత్యకు సంబంధించి కేసులు పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు.

Advocates Murder: హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్య.. పోలీసుల అదుపులో నిందితులు.. కీలక విషయాలు వెల్లడి..
Follow us

|

Updated on: Feb 17, 2021 | 5:34 PM

High Court Advocates Murder: పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు న్యాయవాదుల హత్యకు సంబంధించి కేసులు పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. వివాదాల నేపథ్యంలోనే న్యాయవాద దంపతులను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు.. వీరి హత్యకు పాల్పడిన కుంటా శ్రీనివాస్‌, అతని ఇద్దరు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఆలయం నిర్మాణం వ్యవహారంలో కుంటా శ్రీనివాస్‌కు, వామన్ రావుకు మధ్య విబేధాలు తలెత్తాయి. అదేకాకుండా.. శీలం రంగయ్య లాకప్ డెత్ కేసుకు సంబంధించి హైకోర్టులో వామన్ రావు, నాగమణి లు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టులో ఈ కేసులో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను విచారణాధికారిగా నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసును వాపస్ తీసుకోవాలంటూ గుర్తు తెలియని దుండగులు వామన్ రావు, నాగమణిలను బెదిరించారు.

ఈ నేపథ్యంలో తమకు ప్రాణ హానీ ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణి ఫిర్యాదు చేశారు. కాగా, ఇవాళ ఆలయ నిర్మాణానికి సంబంధించి కుంటా శ్రీనివాస్‌పై పెద్దపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వామన్ రావు దంపతులు వచ్చారు. ఇది తెలుసుకున్న నిందితులు బ్రెజ్జా కారులో వచ్చి రామగిరి మండలం కలవచర్లలో మధ్యాహ్నం 2.30 సమయంలో వామన్ రావు దంపతులిద్దరిపై కత్తులతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. కుంటా శ్రీనివాస్ సహా అతని ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, వామన్ రావు దంపతుల మృతిపై తెలంగాణ బార్ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Also read:

Advocate Murder: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. హైకోర్టు అడ్వకేట్ దంపతులను కత్తులతో నరికి చంపిన దుండగులు..

Sapota benefits: సపోటాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..