Advocate Murder: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. హైకోర్టు అడ్వకేట్ దంపతులను కత్తులతో నరికి చంపిన దుండగులు..
High Court Advocate Murder: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు అడ్వొకేట్ దంపతులను దుండగులు అత్యంత దారుణంగా
High Court Advocates Murder: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్ దంపతులను దుండగులు అత్యంత దారుణంగా హత మార్చారు. రామగిరి మండలం కలవచర్లలో న్యాయవాద దంపతులను దుండగులు అతి కిరాతకంగా నరికేశారు. హైదరాబాద్ నుంచి మంథని వెళ్తుండగా దుండులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కారులోనే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఈ దాడిలో న్యాయవాదులు వామన్ రావు, భార్య నాగమణి అక్కడికక్కడే మృతి చెందారు.
అయితే, కొన ప్రాణాలతో ఉన్న వామన్ రావు.. తనపై కుంట శ్రీనివాస్, అతని అనుచరులు దాడి చేసినట్లు స్థానికులకు వెల్లడించారు. అనంతరం వామన్ రావు కన్నుమూశారు. ఈ దారుణ హత్య విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. దాడి జరిగిన విధానాన్ని అంచనా వేశారు. అలాగే వామన్ రావు స్థానికులకు చెప్పిన విషయాన్ని వాంగ్మూలంగా స్వీకరించిన పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వీరి హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదిలాఉండగా, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకు వ్యతిరేకంగా న్యాయవాది వామన్ రావు పలు కేసులను వాదిస్తుండటం.. వీరి హత్యకు పాల్పడిన కుంట శ్రీనివాస్ మంథని టీఆర్ఎస్ మండలం అధ్యక్షుడు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదేగాక.. శీలం రంగయ్య లాకప్ డెత్ కేసులోనూ వామన్ రావు పిల్ వేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, న్యాయవాదులైన వామన్ రావు, నాగమణిల హత్యపై తెలంగాణ న్యాయవాదుల సంఘం స్పందించింది. వీరి హత్యను తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also read:
కెనడాకు పాకిన వ్యవసాయ చట్టాల రద్దు వ్యవహరం.. భారతీయులకు దుండగుల బెదిరింపు కాల్స్
గవర్నర్ తమిళిసైకి అందిన నియామక పత్రాలు.. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు