AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్తీ దందా గుట్టు రట్టు.. అధికారుల దాడులు.. భారీగా సరకు పట్టివేత

నిత్యావసర వస్తువులపై కల్తీ రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. వినియోగదారులు నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి. బియ్యం, పప్పు, పసుపు, నూనె, కారం, పాలు.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు...

కల్తీ దందా గుట్టు రట్టు.. అధికారుల దాడులు.. భారీగా సరకు పట్టివేత
Kalthi Khanapur
Ganesh Mudavath
|

Updated on: Feb 26, 2022 | 8:33 AM

Share

నిత్యావసర వస్తువులపై కల్తీ రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. వినియోగదారులు నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి. బియ్యం, పప్పు, పసుపు, నూనె, కారం, పాలు.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు అక్రమార్కులు నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తున్నారు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి, నిల్వ ఉంచిన మాంసాలు, పండ్లకు రసాయన పూతలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో కల్తీలు. ధనార్జనే ధ్యేయంగా కల్తీ చేసి ప్రజలకు అంటగడుతున్నారు. తీరా వాటిని వినియోగించిన వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రజల ఆరోగ్యమంటే లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారు. అధికారులంటే భయం లేకుండా ప్రతి ఆహార పదార్థాన్నీ కల్తీ చేసేస్తున్నారు. ఆకర్షణీయమైన రంగుల్లో ప్యాకెట్లను రూపొందించి, వాటిపై ప్రముఖ కంపెనీల లోగోలు పెట్టి మాయ చేస్తున్నారు. అసలేదో, నకిలీ ఏదో గుర్తించడానికి కూడా వీలు లేకుండా బోల్తా కొట్టిస్తున్నారు. ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ పట్టణ శివారులో కల్తీ వ్యవహారం బయటపడింది. ఆర్ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరిట.. సిరాజ్ అహ్మద్ ముఠా కల్తీ ఆహార పదార్థాల తయారీ ప్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రూ.కోటి విలువైన కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టే డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా సాగుతున్నట్లు అధికారులు, పోలీసులు గుర్తించారు. ఫ్యాక్టరీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా కల్తీ ఆహార పదార్థాల తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read

Ajay Devgn : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా బాలీవుడ్ స్టార్ హీరో.. నార్త్‌తో పాటు సోత్‌లో కూడా..

యమ ధర్మరాజే వదిలేశాడేమో !! క్షణ కాలంలో ప్రాణాలు సేఫ్ !! వీడియో

Gold Bands: గోల్డ్ బాండ్లు అంటే ఏమిటి.. అందులో పెట్టుబడి పెట్టడం మంచిదేనా..