Goreti Venkanna: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.. అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్
గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. 2021 సంవత్సరానికి గాను తెలుగులో సాహిత్యంలో
Goreti Venkanna: కవి, రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను తెలుగులో సాహిత్యంలో ఎంపికచేశారు. ‘వల్లంకి తాళం’ సాహిత్యానికి ఈ అవార్డుకు ఎంపికశారు. తగుళ్ల గోపాల్ కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ లభించింది. కడియం రచనకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. బాల సాహిత్య పురస్కారానికి దేవరాజు మహారాజు ఎంపికయ్యారు. ‘నేను అంటే ఎవరు’ నాటకానికి ఈ పురస్కారం లభించింది. ఈ మేరకు కేంద్రం గురువారం వెల్లడించింది. 2021కి గాను మొత్తం 20 భాషల్లో అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గోరటి వెంకన్న ఏకనాథం, రేల పూతలు, అల చంద్రవంక వంటి రచనలతో పేరు తెచ్చుకున్నారు.
అభినందించిన సీఎం కేసీఆర్
ప్రముఖ కవి, శాసన మండలి సభ్యుడు గోరెటి వెంకన్న కు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. గోరెటి వెంకన్నకు ఈ సందర్బంగా సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని సీఎం అన్నారు. మానవ జీవితానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని.. మనిషికి ఇతర జంతు పక్షి జీవాలకు వున్న అనుబంధాన్ని గోరెటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరెటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని సిఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోశించారని తెలిపారు . గోరెటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సిఎం పేర్కొన్నారు.
గోరటి వెంకన్న బయోడేటా…
పుట్టింది.. 1963 లో నాగర్‌కర్నూల్ జిల్లా, గౌరారం (తెల్కపల్లి) తల్లిదండ్రులు.. తండ్రి నర్శింహ, తల్లి ఈరమ్మ, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు విద్య… ఉస్మానియా యూనివర్సిటీ నుంచీ ఎంఏ (తెలుగు) వృత్తి… ప్రస్తుతం ఏఆర్ సబ్ డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గోరటి వెంకన్న
పాటలు, సాహిత్యం… చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి ఉన్నప్పటికీ ఆయనకు సినిమా పాటలంటే చిన్న చూపు ఉండేదట ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్న లోని సృజనాత్మకతను గుర్తించి పాటల పుస్తకాలను ఇస్తుండేవారు రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984 లో ఆయన రాసిన.. ‘నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో’ అనే పాట చాలా పేరు తెచ్చింది వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాలుపంచుకున్న గోరటి వెంకన్న అదే ప్రభావంతో అనేక పాటలు రాశాడు. ఆయన రాసిన పాటలు జన నాట్యామండలి వాళ్ళు సభల్లో పాడేవారు పల్లెప్రజలతో సంబంధంమున్న, ప్రకృతిలో భాగమైన అనేక అంశాలపై ఆయన పాటలు రాశారు సంత, కొంగ, తుమ్మచెట్టు వంటి నిత్య జీవితంలో కనిపించే అంశాలపైనా పాటలు రాయడం వెంకన్న ప్రత్యేకం రేల పూతలు, ఏకనాథం మోత, పూసిన పున్నమి, వల్లంకితాళం, ద వేవ్ ఆఫ్ ద క్రిసెంట్ అనే పుస్తకాలు రాశారు.
సినిమా పాటలు.. రాజ్యహింస పెరుగుతున్నాదో.. పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నదో.. అనే పాట ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ వినడం తటస్థించింది. ఆయన ఈపాట రాసింది ఎవరా అని రెండు నెలలపాటు వెతికి పట్టుకున్నాడు. శంకర్ ఆయన్ను సినిమా కోసం పాట రాయమని అడిగితే నిర్లక్ష్యంగా చూశాడు. సినిమా పాటలన్నీ పడికట్టు పదాలతో రాయబడి ఉంటాయనీ సినిమాలతో సమాజంలో మార్పు రాదని ఆయన అభిప్రాయం చివరకు మిత్రుడు సాహు ఇచ్చిన ట్యూన్ తో జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో అనే పాటను రాశాడు. అది బాగా హిట్టయింది. అలాగే “కుబుసం” సినిమా కోసం ఆయన రాసిన ‘పల్లె కన్నీరు పెడుతోంది’ అనే పాట కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, కుబుసం సినిమాల్లో రాసిన విప్లవ గీతాలు ఇప్పటికీ సంచలనమే.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన రాసిన పాటలు ‘ధూం ధాం’ వంటి వేదికలపైన, ర్యాలీలలోనూ గాయకులు, ఉద్యమకారుల నోటి వెంట నిరంతరం వినిపించేవి. సినిమా పాటలు ఎన్ని రాసినా, ఎన్ని అవకాశాలు వచ్చినా వెంకన్న ప్రజా కవిగానే ఉండటానికి ఇష్టపడ్డారు
పురస్కారాలు, పదవులు.. కబీర్ సమ్మాన్, కాళోజీ, సినారే, లోకనాయక్, అరుణసాగర్, హంస అవార్డులను, అధికార భాషా సంఘం పురస్కారం పొందిన గోరటి వెంకన్న 2020, నవంబరులో శాసనమండలి సభ్యుడిగా (గవర్నర్ కోటా) ఎంపిక
Also Read: