Telangana High Court: ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటుపై హైకోర్టులో విచారణ.. కీలక సూచనలు చేసిన న్యాయస్థానం
Telangana High Court: ఇళ్ళ మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పబ్ నిర్వాహకులకు పలు సూచనలు చేసింది...
Telangana High Court: ఇళ్ళ మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పబ్ నిర్వాహకులకు పలు సూచనలు చేసింది. పబ్‌లో ముందు ఖచ్చితంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది. తాగి వాహనాలను నడపవద్దంటూ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిని విచారిస్తామని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేయాలి హైకోర్టు పబ్ నిర్వాహకులకు సూచించింది. తాగిన వారికి డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని, అలాగే డీజే సౌండ్‌లో 45 డెసిబల్స్ మించకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. ఈ నిబంధనలు జనవరి 3వ తేదీ అర్థరాత్రి వరకు అమలు చేయాలని ఆదేశించింది.
ఎక్సైజ్ శాఖను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పోలీస్ శాఖ తరపున న్యాయవాది కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. ఎక్సైజ్ శాఖను ప్రతివాదులుగా చేర్చాలని తెలిపింది. అలాగే మైనర్లను పబ్ లోపలికి అనుమతించవదని, పేరెంట్స్ తో పాటు వచ్చిన మైనర్‌లను అనుమతించవద్దని సూచించింది. వేడుకలపై హైకోర్టు ఆదేశాలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు పరుస్తూ పోలీస్ శాఖ నిబంధనలు పాటించాలని తెలిపింది. తదుపరి విచారణలో హైకోర్టుకు అందే నివేదికల ఆధారంగా విచారణ చేపడతామని, విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి: