EPFO E- Nomination: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ పని డిసెంబర్‌ 31 తర్వాత కూడా చేయవచ్చు

EPFO E- Nomination: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) పీఎఫ్‌ చందాదారులు తమ నామినీ పేరును చేర్చేందుకు డిసెంబర్‌ 31 గడువు విధించిన విషయం..

EPFO E- Nomination: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ పని డిసెంబర్‌ 31 తర్వాత కూడా చేయవచ్చు
Follow us

|

Updated on: Dec 30, 2021 | 3:40 PM

EPFO E- Nomination: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) పీఎఫ్‌ చందాదారులు తమ నామినీ పేరును చేర్చేందుకు డిసెంబర్‌ 31 గడువు విధించిన విషయం తెలిసిందే. నామినీ పేరు చేర్చకుంటే పలు ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ-నామినేషన్‌ చేసేందుకు పీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో చేసుకునే వెలుసుబాటు ఉంది. ఈ-నామినేషన్‌ సర్వీస్‌ అనేది ఆన్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు పీఎఫ్‌ ఖాతా ఉంటే అందులో నామిని పేరును నమోదు చేయాలి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే డబ్బులు రావు. అయితే ఈపీఎఫ్‌ఓనామినీని మార్చడానికి పీఎఫ్‌ సభ్యులు కొత్త నామినేషన్‌ దాఖలు చేయవచ్చని ఈపీఎఫ్‌ఓ ట్వీట్‌ చేసింది. అయితే గడువు సమీపిస్తున్న కొద్ది తమతమ పీఎఫ్‌ ఖాతాకు నామినీ పేరు చేర్చేందుకు

అయితే ఈపీఎఫ్‌ఓ చందాదారులకు ఇప్పుడు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఈపీఎఫ్‌ సంస్థ. ఈ-నామినేషన్‌ చేయనివారు ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. డిసెంబర్‌ 31 తర్వాత కూడా ఈ-నామినేషన్‌ చేయవచ్చని ఈపీఎఫ్ఓ తెలిపింది.

చందాదారులు నామినీ పేరు వివరాలు జత చేయాలని ప్రయత్నించినప్పటికీ ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌ సర్వర్‌ డౌన్‌ కావడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈపీఎఫ్‌ఓ ఓ ట్వీట్‌ చేసింది. డిసెంబర్‌ 31 తర్వాత కూడా ఈ-నామినేషన్‌ దాఖలు చేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి గడువు తేదీ మాత్రం నిర్ణయించలేదని వెల్లడించింది. ఈపీఎఫ్‌ఓ ట్వీట్‌ ప్రకారం.. ప్రావిడెండ్ ఫండ్‌), పెన్షన్‌, చందాదారులు మరణించిన తర్వాత ప్రయోజనం పొందేందుకు, అలాగే నామినీ సులభంగా ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ చేయడానికి ఈ-నామినేషన్‌ సులభతరంగా ఉంటుంది.

తాజాగా పీఎఫ్‌ అకౌంట్లో నామినీ పేరును ఫైనల్‌గా పరిగణిస్తారు. అయితే ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత కల్పిస్తోంది ఈపీఎఫ్‌వో. ఇందులో ప్రతి నెల జమ అయ్యే మొత్తం భవిష్యత్తలో వివాహాలకు, ఇంటి నిర్మాణం, ఇతర ముఖ్యమైన అవసరాలకు ఎంతోగానో ఉపయోగపడనుంది. ఇక పెన్షన్‌ పథకం, బీమా సౌకర్యం ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటుంది. అయితే వీటన్నింటిని పీఎఫ్‌ చందాదారుడు నామినీని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. చందదారులు నామినీని సులభంగా యాడ్‌ చేసుకనే సదుపాయాన్ని కల్పిస్తోంది ఈపీఎఫ్‌ఓ. ఆన్‌లైన్‌లో వివరాలన్ని సమర్పించాల్సి ఉంటుందని ఈపీఎఫ్‌ఓ కోరుతోంది.

ఆన్‌లైన్‌లో నామినీని వివరాలు నమోదు చేయడం ఎలా..?

► ముందుగా ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ (epfindia.gov.in)ను ఓపెన్‌ చేయాలి.

► సర్వీస్‌ కేటగిరిలో ఫర్‌ ఎంప్లాయీస్‌ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

► ఆ తర్వాత Member UAN/Online Service (OCS/OTCP) అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

► యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి.

► అందులో మేనేజ్‌ కేటగిరిలోని ఈ-నామినేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

► అక్కడ ‘మేనేజ్‌’ విభాగంలోని ‘ఈ-నామినేషన్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

► ఆ తర్వాత యస్‌ అని క్లిక్‌ చేసి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయవచ్చు.

► యాడ్‌ ఫ్యామిలీ డీటెయిల్స్‌ ద్వారా నిమినీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

► సేవ్‌ నామినేషన్‌పై క్లిక్‌ చేశాక మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

RBI: బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. ఆ అప్‌డేట్‌ చేసేందుకు మరో మూడు నెలలు పొడిగింపు

New Bank Rules: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. లావాదేవీలపై జనవరి 2022 నుంచి కొత్త రూల్స్!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!