AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Elections 2022: షెడ్యూల్ ప్రకారమే 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుః ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు లక్నో వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు.

Assembly Elections 2022: షెడ్యూల్ ప్రకారమే 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుః ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర
Chief Election Commissioner Sushil Chandra
Balaraju Goud
| Edited By: |

Updated on: Jan 20, 2022 | 8:30 PM

Share

Assembly Elections 2022: వచ్చే ఏడాది జరుగనున్న 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు లక్నో వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూలు ప్రకారమే ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి సకాలంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం లక్నోలో విలేకరుల సమావేశంలో సుశీల్ చంద్ర మాట్లాడుతూ.. జనవరి 5న తుది ఓటరు జాబితా వస్తుందని తెలిపారు. ఓటరు జాబితా తుది ప్రచురణకు సంబంధించి జనవరి 5 తర్వాత ఏదైనా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. దీంతో వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే, 80 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు, కరోనా సోకిన వారు పోలింగ్ కేంద్రానికి రాలేని వారి ఇంటి వద్దకే ఎన్నికల సంఘం చేరుకుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 15 కోట్లకుపైగా ఉందన్నారు. తుది ప్రచురణ తర్వాత అసలు ఓటర్ల గణాంకాలు వస్తాయన్నారు. చివరి ప్రచురణ తర్వాత కూడా ఎవరి పేరు రాకపోతే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 52.8 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. వీరిలో 23.92 లక్షల మంది పురుష ఓటర్లు, 28.86 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య 19.89 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సుశీల్ చంద్ర పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమయ్యామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది రాజకీయ పార్టీల డిమాండ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు, ర్యాలీల్లో జనం రావడంపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పోలింగ్ బూత్‌ల వద్ద తగిన సంఖ్యలో మహిళా బూత్ వర్కర్లను కూడా నియమించాలని డిమాండ్ చేశారు. వీటిని పరిశీలిస్తున్నామని కరోనా మహహ్మరి దృష్ట్యా కొత్త నిబంధనలు జారీ చేస్తామన్నారు.

Read Also…Uttarakhand Elections: ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌లో భలే గిరాకీ.. 70 స్థానాలకు 600 దరఖాస్తులు..!

 TS Mandali Chairman: త్వరలో ఖాళీ అవుతున్న శాసన మండలి ప్రొటెం ఛైర్మన్.. తెలంగాణ పెద్దల సభకు పెబ్బ ఎవరు?