Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఈ నెల 26న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రాక..బీజేపీ నేతల్లో నయా జోష్.. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు

ఈ నెల 26న తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఐఎస్బీ వార్షికోత్సవంలో మోడీ పాల్గొననున్నారు. 20 రోజుల వ్యవధిలో రాష్ట్రానికి అగ్ర నేతల రాకతో బీజేపీలో కొత్త జోష్ నెలకొంది. బండి సంజయ్ ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

PM Modi: ఈ నెల 26న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రాక..బీజేపీ నేతల్లో నయా జోష్.. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
Pm Modi Hyderabad
Follow us
Surya Kala

|

Updated on: May 19, 2022 | 10:20 AM

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 26న హైదరాబాద్ కు(Hyderabad) రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట(Begumapet) విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రాక అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలంతా రాష్ట్రానికి వస్తుండడంతో మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయవంతం కావడంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనలు పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో రాష్ట్ర పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

తాజాగా ప్రధాని రాష్ట్రానికి వస్తున్న సమాచారం అందడంతో బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను కనివినీ ఎరగని రీతిలో దిగ్విజయవంతం చేసే దిశగా బండి సంజయ్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం పలికేలా బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో కనీవినీ ఎరగని రీతిలో ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. మొత్తమ్మీద అగ్రనేతల రాకతో జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే సంకేతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..