Viral video: నీటిలో మునిగిపోతున్న జింకను చూసి ఏనుగు ఏం చేసిందంటే.. వీడియో చూస్తేకానీ నమ్మలేరు

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనసుకు హత్తుకుంటే.. మరికొన్ని భావోద్వేగాలు కలిగించేలా ఉంటాయి.. అలాంటిదే ఇక్కడో వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

Viral video: నీటిలో మునిగిపోతున్న జింకను చూసి ఏనుగు ఏం చేసిందంటే.. వీడియో చూస్తేకానీ నమ్మలేరు
Elephant
Follow us
Jyothi Gadda

|

Updated on: May 21, 2022 | 4:59 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనసుకు హత్తుకుంటే.. మరికొన్ని భావోద్వేగాలు కలిగించేలా ఉంటాయి.. అలాంటిదే ఇక్కడో వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. కష్టాల్లో ఉన్న జింకను చూసిన ఏనుగు చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. జింకను రక్షించడం కోసం ఏనుగు చేసిన పనికి జూ కీపర్‌ సైతం నమ్మలేకపోతున్నాడు.. ఈ షాకింగ్‌ వీడియో గ్వాటెమాల సిటీలోని లా అరోరా జూ లో జరిగింది.

కొన్ని సార్లు ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతాయి. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. జంతువులు క్రూరంగా ఉంటాయని సాధారణంగా నమ్ముతారు. కానీ, అది నిజంకాదని చెప్పే అనేక వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. మనుషుల్లో ఉండే,దయ, మానవత్వం జంతువులలో కూడా ఉంటుంది. దయ కరుణ మానవులలో ఉన్నట్టుగా ఉంటుంది. దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలు సోషల్‌ మీడియాలో అనేకం వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. వీడియోలో నీటిలో మునిగిపోతున్న జింక ప్రాణాలను రక్షించడానికి ఏనుగు ఎలా సహాయం చేసిందో చూడొచ్చు.

జూలో దాహం తీర్చుకునేందుకు వెళ్లిందో ఏమోగానీ, ఓ జింకపిల్ల నీళ్లలో పడి మునిగిపోతోంది. దాన్ని చూసిన ఓ గజరాజు..జింకను కాపాడాలనుకుంటుంది… అందుకోసం ఏం చేయాలో అర్థం కాలేదు..దాంతో గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఏనుగు ఆందోళనగా అరవటం అర్థం చేసుకున్న జూ సిబ్బంది హుటాహుటినా ఏనుగు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. నీటిలో మునిగిపోతున్న జింకను చూసి వెంటనే దాన్ని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆ జూకీపర్‌ జింకకొమ్మును పట్టుకుని నీటిలో నుండి బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు వీడియోలు స్పష్టంగా చూడొచ్చు. ఇదంతా పక్కనే ఉన్న ఏనుగు చూస్తుంది. దీనిని బట్టి ఏనుగులు అన్ని జంతువుల్లో కెల్లా సున్నితమైన జంతువులుగా పరిగణింపబడుతున్నాయి. మనుషుల మాదిరిగానే భావోద్వేగాలను అవిఅర్థం చేసుకునే శక్తి వాటికి ఉంది. అంతే కాదు కష్టాల్లో ఉన్న మరో జీవిని చూసి అవి చలించిపోతాయి.

ఇవి కూడా చదవండి