PM Modi: తెలంగాణపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్.. ఇవాళ జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ
ఎన్నికల నగరా మోగింది.. తేదీలు కూడా వచ్చేశాయ్.. దీంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడును పెంచాయి. ఈ క్రమంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఈసారి ఎన్డీయేకు 400 సీట్లు పక్కా అంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.
ఎన్నికల నగరా మోగింది.. తేదీలు కూడా వచ్చేశాయ్.. దీంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడును పెంచాయి. ఈ క్రమంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఈసారి ఎన్డీయేకు 400 సీట్లు పక్కా అంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్.. అంటూ 10ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాని మోదీ.. రాష్ట్రంలోని 17 లోక్ సభ సీట్లలో బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. నిన్నసాయంత్రం చిలకలూరిపేట జనగళం సభలో పాల్గొన్న ప్రధాని.. రాత్రికి హైదరాబాద్ చేరుకుని రాజ్‌భవన్‌లో బసచేశారు. ఈ ఉదయం రాజ్‌భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 11 తర్వాత జగిత్యాల చేరుకొని, బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు సభకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు.. అంతేకాకుండా ప్రధాని మోదీ సభకు భారీ జనసమీకరణ ప్లాన్ చేశారు.
కాగా.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..