AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని నోట ఆదివాసీ మాట.. దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న ఆదిలాబాద్ పేరు..!

భారతదేశంలో AI ప్రాధాన్యత పెరుగుతుందని.. మారుమూల గిరిజన గ్రామాల్లోను ఏఐని వినియోగిస్తున్నారని.. అందుకు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉపాధ్యాయుడు తొడసం కైలాసే నిదర్శనమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తొడసం కైలాస్.. అడవుల జిల్లా ఆదిలాబాద్, మావల మండలం వాఘాపూర్, గ్రామానికి చెందిన గోండి (భాష) రచయిత.

PM Modi: ప్రధాని నోట ఆదివాసీ మాట.. దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న ఆదిలాబాద్ పేరు..!
Pm Modi On Gond Language
Naresh Gollana
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 25, 2025 | 2:53 PM

Share

ఆదిలాబాద్ జిల్లా పేరు మరోసారి దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఓ ఆదివాసీ ఉపాధ్యాయుడి చేసిన కృషిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంతో ఆదిలాబాద్ జిల్లా ఆనందంలో మునిగితేలుతోంది. తమ భాష యాసను బ్రతికించుకునేందుకు ఆదివాసీ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ చేస్తూ కృషి ఖండాతరాలు దాటుతోంది. కృత్రిమ మేథస్సు ఏఐను వినూత్నంగా వినియోగిస్తూ గోండు భాషాభివృద్ధి కి కైలాస్ పడుతున్న తాపత్రాయాన్ని‌ యావత్ ఆదివాసీ సమాజం కొనియాడుతోంది. ఇంతకీ ఎవరీ కైలాస్.. దేశప్రధాని కొనియాడేంతలా ఆయన చేస్తున్న కృషి ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

తొడసం కైలాస్.. అడవుల జిల్లా ఆదిలాబాద్, మావల మండలం వాఘాపూర్, గ్రామానికి చెందిన గోండి (భాష) రచయిత. ప్రస్తుతం ఇదే జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం, గౌరాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కనుమరుగయ్యే ప్రమాదంలో పడిన మాతృభాష గోండిని రాబోయే తరాలకు అందించేందుకు ఈ ఆదివాసీ ఉపాధ్యాయుడు తోడసం కైలాస్ 2017 నుంచి యూట్యూబ్ మాధ్యమం ద్వారా గోండి భాషను ప్రచారం చేస్తున్నాడు. తాజాగా ఏఐ ని ఉపయోగించి యూట్యూబ్ లో వినూత్నంగా పాఠాలు చెబుతూ గోండి బాషను ప్రచారం చేస్తున్నారు కైలాస్. గోండి భాషపైన లోతుగా అధ్యయనం చేసి, వాడుకలో లేని కొన్ని పదాలు, పూర్వీకులు ఉపయోగించిన భాష పదాలను సేకరించిన కైలాస్.. వాటిని స్వచ్ఛమైన గోండి భాషలో రాసి.. గూగుల్ డాక్యూమెంట్, బ్లాగ్ లో భద్రపరుస్తున్నాడు కైలాస్.

తాజాగా గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేయడానికి తన మాతృభాష గోండులోకి అనువదించి‌ శభాష్ అనిపించుకున్నాడు. పిల్లలు, యువతలో మంచి ఆలోచనలు కలిగించడానికి ‘సద్ విచార్’ పేరిట మరో పుస్తకం రాశారు కైలాస్. గోండి భాషలో కాండిరంగ్ వేసుడింగ్(పిల్లల ప్రపంచం) పుస్తకాన్ని గోండ్వానా సాహిత్య అకాడమీ ద్వారా విడుదల చేశారు. ఇలా గోండి బాష ప్రపంచ వ్యాప్తంగా చేసేలా.. రాబోయే ఆదివాసీ తరానికి అందించేలా కైలాస్ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్‌లో కొనియాడారు‌. గిరిజన భాషలను సంరక్షించడానికి, గోండి బాషను ప్రోత్సహించడానికి కృత్రిమ మేథస్సు (AI)ని వినూత్నంగా ఉపయోగించినందుకు అంకితభావంతో పని చేస్తున్న కైలాస్ కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ 119వ ఎడిషన్ సందర్భంగా కొనియాడారు.

భారతదేశంలో AI ప్రాధాన్యత పెరుగుతుందని.. మారుమూల గిరిజన గ్రామాల్లోను ఏఐని వినియోగిస్తున్నారని.. అందుకు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉపాధ్యాయుడు తొడసం కైలాసే నిదర్శనమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సాంకేతికత ద్వారా విద్యను వినూత్నంగా ఉపయోగించడం పాటు రాబోయే తరాలకు భాషను అందించేలా తొడసం కైలాష్‌ను చేస్తున్న కృషికి ప్రశంసించారు మోడీ. గోండ్ , కోలం భాషలలో పాటలను డిజిటల్‌గా అందించడానికి AIని ఉపయోగిస్తున్న విధానం తనను ఎంతగానే ఆకట్టుకుందని కొనియాడారు. ‘కొలామి’ భాషలో గీతానికి స్వర రచన చేసేందుకు ఆయన ఏఐని వినియోగించారని.. మహాభారత్‌ పుస్తకాన్ని సైతం గోండు భాషలోకి అనువదించారని గుర్తు చేశారు. మాతృబాషను కాపాడుకోవాలని కైలాస్ ను ఆదర్శంగా తీసుకుని మరింత మంది యువత ఏఐలో అధ్బుతాలు సృష్టించాలని కోరారు. మోదీ నోట ఆదిలాబాద్ ఆదివాసీ టీచర్ పేరు ప్రముఖంగా వినిపించడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..