AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మన్‌ కీ బాత్‌లో కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ ఆర్ట్‌పై మోదీ ప్రశంసలు..!

Karimnagar Silver Filigree: కళల కాణాచిగా పేరుపడిన కరీంనగర్ వాసులు మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు తమలోని కళాత్మకతను ప్రదర్శించిన విషయాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మన్ కీ బాత్ లో పీఎం ఫిలిగ్రీ కళ గురించి ప్రస్తావించారు. కరీంనగర్‌లో తయారు చేసిన..

PM Modi: మన్‌ కీ బాత్‌లో కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ ఆర్ట్‌పై మోదీ ప్రశంసలు..!
G Sampath Kumar
| Edited By: Subhash Goud|

Updated on: Nov 30, 2025 | 8:09 PM

Share

Karimnagar Silver Filigree: కరీంనగర్ లో ప్రసిద్ది చెందిన సంప్రదాయ పూల ఆకృతితో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను ఇటలీ ప్రధానికి బహుకరించానని ప్రధాని మోదీ చెప్పడంతో ఇప్పుడు ఫిలిగ్రీపై చర్చ నడుస్తుంది. వెండితో ఎన్నో రకాలుగా ఆభరణాలను తయారు చేసినా పిలిగ్రీ కళను మాత్రం కరీంనగర్ బిడ్డలు మాత్రమే అందిపుచ్చుకున్నారు. పిలిగ్రీ ద్వారా తమలోని కళను ప్రదర్శిస్తున్న కరీంనగర్ వాసుల చరిత ప్రంపంచానికి సుపరిచితమే. గతంలో జి20 సమావేశాల్లోనూ కరీంనగర్ పిలిగ్రీ తళుకుమనిపించనుంది. కరీంనగర్ కళాకారులు తమ నైపుణ్యానికి పదునుపెట్టి తయారు చేసిన వస్తువులు జి20 దేశాల ప్రతినిధులకు ఈ బహుమతులు అందించారు.

గతం లో జి20 సమ్మిట్‌కు హజరైన 20 దేశాల ప్రతినిధులకు కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ బ్యాడ్జెస్ ఇచ్చారు.అత్యంత అరుదైన కళల్లో ఒకటైన సిల్వర్ పిలిగ్రీ కళ దేశంలోనే చాలా తక్కువమంది నేర్చుకున్నారు. తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన వారితో పాటు ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందిన వారు కూడా ఈ కళను అందిపుచ్చుకున్నారు. అయితే కరీంనగర్ కళాకారులు వారసత్వంగా వచ్చిన సిల్వర్ పిలిగ్రీ కళను నేటికీ పోషిస్తూ తమలోని కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. జీఐ కూడా పొందిన కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ కళాకారులు గతంలో హైదరాబాద్‌కు ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. కానీ ఈ సారి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన జి20 సమ్మిట్ ప్రతినిధులకు బహుమతులు అందుంచారు.

ఇది కూడా చదవండి: Rapido Rider: చేసేది రాపిడో డ్రైవర్‌.. ఖాతాలో రూ.331 కోట్లు.. రంగంలోకి ఈడీ.. దర్యాప్తులో కీలక విషయాలు!

అంతేకాకుండా న్యూ ఢిల్లీలో జరగనున్న సమ్మిట్ సందర్భంగా దేశంలోనే అరుదైన కళాత్మకతను ప్రదర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేసింది. ఇందులో కూడా కరీంనగర్ కు చెందిన అశోక్ స్టాల్‌ని ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. ఈ స్టాల్ లో కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ కళాకారుల చేతిలో తయారు చేసిన అద్భుత కళాఖండాలు ప్రదర్శించనున్నారు. దీనివల్ల జి20 దేశాల్లో భారత్‌లో ఉన్న అత్యంత అరుదైన కళకు గుర్తింపు లభించింది.

కళల కాణాచిగా పేరుపడిన కరీంనగర్ వాసులు మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు తమలోని కళాత్మకతను ప్రదర్శించిన విషయాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మన్ కీ బాత్ లో పీఎం ఫిలిగ్రీ కళ గురించి ప్రస్తావించారు. కరీంనగర్‌లో తయారు చేసిన సిల్వర్ ఫిలిగ్రీ బహుమతులు.. వివిధ దేశాధినేతలకు అందించానని అన్నారు. ఈ బహుమతిలు తీసుకున్న నేతల సంతోషాన్ని వ్యక్తం చేశారని పీఎం గుర్తు చేశారు. ప్రధాని ప్రకటన తరువాత ఫిలిగ్రీ కళపై చర్చ మొదలైయింది. కళాకారులూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కళను కాపాడుకోవడానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Chanakya Niti: చాణక్య నీతి.. ఈ 5 లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంటి లక్ష్మి అవుతారు!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి