Telangana: పిలిస్తే పలికే పెంపుడు కోళ్లు.. వీటి కథే వేరబ్బా..! ఎక్కడో తెలుసా..?

పిశాచులను ఆవాహమనం చేసే మంత్రాలను విఠలాచార్య సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. బైరాగులపాడు గ్రామానికి చెందిన నరసింహారావు అనే వ్యక్తి, శంఖినీ...దాంఖిని యక్షిణి.. అని పిలవగానే వచ్చి అతని వెంటనే తిరుగుతూ ఉంటాయి.

Telangana: పిలిస్తే పలికే పెంపుడు కోళ్లు.. వీటి కథే వేరబ్బా..! ఎక్కడో తెలుసా..?
Pet Chickens
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Sep 14, 2024 | 3:53 PM

పిశాచులను ఆవాహమనం చేసే మంత్రాలను విఠలాచార్య సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. బైరాగులపాడు గ్రామానికి చెందిన నరసింహారావు అనే వ్యక్తి, శంఖినీ…దాంఖిని యక్షిణి.. అని పిలవగానే వచ్చి అతని వెంటనే తిరుగుతూ ఉంటాయి. అతను వాటిని పెంచుకుంటున్నాడు కూడా..! అవి అంటే అతనికి ప్రాణం అంట. అస్సలు.. ఈ పిశాచులు పేర్లు…ఎంటి..? అతను ఎవ్వరో..? పూర్తిగా తెలియాలంటే…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భైరాగులపాడు వెళ్ళాల్సిందే..!

భూత ప్రేత పిశాచలను మంత్ర శక్తులతో ఆవాహమనం చేసుకుని క్షుద్ర పూజలు చేస్తూ.. భయబ్రాంతులకు గురిచేసే శంఖిని, డాంఖిని యక్షిణి అనే పేర్లు పాత సినిమాల్లో చూస్తుంటాం. సరిగ్గా అలానే ఓం.. క్లిమ్.. బ్రీమ్.. అని మంత్రాలు మాత్రం చదవడు. కానీ.. చేతుల్లో దంపుడు బియ్యం గింజలు పట్టుకుని ఏయ్ శంఖినీ.. డాంఖిని.. యక్షిణి.. అని పిలవగానే వెంటనే పిశాచాలు మాదిరి తాను పెంచుకునే పెంపుడు కోళ్ళు గుంపులు గుంపులుగా వస్తాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు గ్రామంలోని పసుపులేటి నరసింహారావు ఇంటిలో నిత్యం జరిగేదే ఇదే..! అతను చిన్నప్పటి నుంచి కోళ్ళు పెంచుకుంటాడు. ఇతనికి ఇంట్లో కుటుంబ సభ్యులతోపాటు కోళ్ళు అంటే చాలా ఇష్టం. అయితే విచిత్రంగా ఆ కోళ్ళకు పిశాచాల పేర్లు పెట్టుకున్నాడు. పిశాచాల పేర్లతో పిలుస్తుంటే ఆ కోళ్ళు వెంటనే అక్కడికి చేరుకుంటాయి. తాను నిత్యం ఆ కోళ్లకు ఆహారపు గింజలు వేస్తూ ప్రేమగా చూసుకుంటాడు. ఆ కోళ్ళు కూడా యజమాని నరసింహరావును Z+ కేటగిరి సెక్యూరిటీలా తనకు ఎప్పుడూ రక్షణగా వెంటే వెళ్తుంటాయి. అతను సైకిల్ పై వెళ్లిన ఆ కోళ్ళు కూడా గుంపులు..గుంపులుగా ఆతనికి రక్షణగా వెళ్తుంటాయి.

వాటి పేర్లు పిశాచాల పేర్లు కావొచ్చు కానీ. ప్రేమను పంచే యజమానికి ఎలాంటి హానీ జరగకుండా రక్షణగా తిరుగుతూ ఉంటాయి ఇతని కోళ్ళు. భూతల పేర్లు వింటేనే భయబ్రాంతులకు గురవుతుంటాం. అలాంటి పిశాచాల పేర్లను కోళ్ళకు పెట్టుకున్న పసుపులేటి నరసింహారావు కోళ్ళను చూస్తే.. ఎవ్వరైనా ఔరా అనక మానరు. ఇలాంటి కోళ్ళు మాకు ఉంటే బావుండు అనుకుంటున్నారు స్థానికులు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!