T BJP: కాషాయంలో మొదలైన అసలైన డ్రైవ్.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఇక అప్పుడే..!

కేంద్రంలో మూడోసారి అధికారం దక్కించుకున్నాక, సంస్థాగత ఎన్నికలపై కమలనాథులు ఫోకస్ చేశారు. మెంబర్ షిప్ డ్రైవ్‌తో దేశవ్యాప్తంగా ఆ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. దాదాపు మూడు నెలల పాటు సాగే సుదీర్ఘ ప్రక్రియతో బూత్ కమిటీ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు పార్టీలో ఎన్నికలు జరగనున్నాయి.

T BJP: కాషాయంలో మొదలైన అసలైన డ్రైవ్.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఇక అప్పుడే..!
Telangana Bjp Meeting
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 22, 2024 | 4:21 PM

కేంద్రంలో మూడోసారి అధికారం దక్కించుకున్నాక, సంస్థాగత ఎన్నికలపై కమలనాథులు ఫోకస్ చేశారు. మెంబర్ షిప్ డ్రైవ్‌తో దేశవ్యాప్తంగా ఆ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. దాదాపు మూడు నెలల పాటు సాగే సుదీర్ఘ ప్రక్రియతో బూత్ కమిటీ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు పార్టీలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఈ ప్రక్రియతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

కమలం పార్టీలో సంస్థాగత సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంతో దీన్ని ప్రారంభించబోతున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్ పై డిల్లీలో వర్క్ షాప్ తర్వాత సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. సభ్యత్వ నమోదు పై పార్టీ శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు విధివిధానాలు పార్టీ నాయకత్వం ప్రకటించింది. సభ్యత్వ నమోదు కు సంబంధించి తెలంగాణలో 12 మందితో ఓ కమిటీనీ కూడా నియమించారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులతోపాటు పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. తెలంగాణలో మెంబర్ షిప్ డ్రైవ్ ను పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు లోకల్ వార్ కు సైరన్ మోగించారు.

సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో జరిగిన సభ్యత్వ నమోదు వర్క్ షాప్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్, కేంద్ర పార్టీ నుంచి విజయ రహత్కర్, అభయ్ పాటిల్ పాల్గొనగా.. ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, బిజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా గుర్తింపు ఉన్న బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేలా ప్రణాళికలు వేస్కోని.. సభ్యత్వ నమోదులో మహిళలు. యువత, రైతులపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని సూచించారు కిషన్ రెడ్డి.

మెంబర్ షిప్ డ్రైవ్ ఫస్ట్ పేజ్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 25 వరకు మొదటి విడత, అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకుప రెండో విడత సభ్యత్వ నమోదు నిర్వహించనున్నారు. అంతకుముందు ఆగస్ట్ , 24, 25 తేదీల్లో జిల్లా స్థాయి వర్క్స్ షాప్స్, ఆగస్ట్ 26 నుంచి 30 మండల స్థాయి వర్క్ షాప్స్, ఆగస్ట్ 30 రాష్ట్ర స్థాయి మోర్చాలా వర్క్ షాప్స్, ఆగస్ట్ 31 పోలింగ్ బూత్ స్థాయి వర్క్ షాప్స్ నిర్వహిస్తారు. ఈ సారి తెలంగాణలో దాదాపు 50 లక్షల సభ్యత్వం టార్గెట్ గా బీజేపీ ముందుకు వెళ్తోంది.

మెంబర్ షిప్ డ్రైవ్ తర్వాత సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కింది స్థాయి నుంచి పార్టీ అంతర్గత ఎన్నికలు జరగనున్నాయి. బూత్ కమిటి అధ్యక్షుల ఎన్నిక మొదట జరుగుతుంది. తర్వాత మండల కమిటీ, జిల్లా కమిటీ అధ్యక్షుల ఎన్నిక వరస క్రమంలో నిర్వహిస్తారు. ఆపై రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక డిసెంబర్ లో జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక పూర్తయితే జాతీయ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఉన్న రాష్ట్రాలకు నేరుగానే అధ్యక్షుల ఎంపిక చేస్తున్నా, కమల అధినాయకత్వం… మిగిలిన రాష్ట్రాలకు తొందర పడకుండా ఎన్నిక ప్రక్రియద్వారానే అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి రెండోసారి కేంద్రమంత్రి కావడంతో ఆయన ప్లేస్ లో కొత్త అధ్యక్షుడు వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. పలువురి పేర్లు కూడా రేసులో ముందున్నాయి. మరికొంత మంది పేర్లు కన్ఫర్మ అయ్యాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అవే పేర్లతో సంస్థాగత ఎన్నికల్లోనే కొత్త అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని పార్టీనేతలు అంటున్నారు. ప్రస్తుతం మెంబర్ షిప్ డ్రైవ్ తో బిజీ షెడ్యూల్ లోకి బీజేపీ వెళ్లబోతుందన్న మాట..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కమలం పార్టీలో సంస్థాగత సంగ్రామం షురూ..!
కమలం పార్టీలో సంస్థాగత సంగ్రామం షురూ..!
మిథున రాశిలోకి కుజుడి.. ఆ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు..!
మిథున రాశిలోకి కుజుడి.. ఆ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు..!
బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించిన సుప్రీం కోర్టు
బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించిన సుప్రీం కోర్టు
సెప్టెంబర్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సెప్టెంబర్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
నిమిషాల్లో రూ. 1లక్ష విత్ డ్రా.. పీఎఫ్ ఖాతాదారులు చేయాల్సిందిదే..
నిమిషాల్లో రూ. 1లక్ష విత్ డ్రా.. పీఎఫ్ ఖాతాదారులు చేయాల్సిందిదే..
రాత్రి వేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఉచిత ప్రయాణం నిజమేనా..?
రాత్రి వేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఉచిత ప్రయాణం నిజమేనా..?
అరంగేట్రంలోనే 41 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్.. బలైంది మనోడే
అరంగేట్రంలోనే 41 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్.. బలైంది మనోడే
విద్యుత్‌ మీటర్‌లో మాగ్నెట్‌ను అమర్చితే బిల్లు తగ్గుతుందా?
విద్యుత్‌ మీటర్‌లో మాగ్నెట్‌ను అమర్చితే బిల్లు తగ్గుతుందా?
గేదెలకు మేత వేయలేదని కొడుకు కాల్చి చంపిన తండ్రి
గేదెలకు మేత వేయలేదని కొడుకు కాల్చి చంపిన తండ్రి
రోహిత్, గంభీర్‌లకు అసలైన టెస్ట్.. 17 ఏళ్ల ఓటమికి చెక్ పెట్టేనా?
రోహిత్, గంభీర్‌లకు అసలైన టెస్ట్.. 17 ఏళ్ల ఓటమికి చెక్ పెట్టేనా?
వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే