AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దారుణం.. సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు.. ఎందుకంటే?

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తాండాలో దారుణం ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కుటుంబంపై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. తెల్లవారుజామున సర్పంచ్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఇంటి పైకప్పు నుంచి నిద్రిస్తున్న సర్పంచ్, కుటుంబ సభ్యులకు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో సర్పంచ్, అతని భార్య సహా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

Telangana: దారుణం.. సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు.. ఎందుకంటే?
Stepson Attacks Sarpanch's Family Over Property
Anand T
|

Updated on: Mar 24, 2026 | 10:43 AM

Share

ఏకంగా గ్రామ సర్పంచ్‌పైనే ఓ దుండగుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రూప్ సింగ్ తాండా సర్పంచ్‌గా ఉన్న రమణి భాయ్ భర్త భర్త హన్మంత్ నాయక్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆయన మొదటి భార్య నాతిభాయ్‌కు ఇద్దరు కుమారు, ఒక కుమార్తె ఉన్నారు. కూతురు వివాహమవ్వగా చిన్న కుమారుడు కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. అయితే ఇటీవలే ఆయన మొదటి భార్య నాతిభాయ్ కూడా మరణించింది.ప్రస్తుతం చిన్న కుమారుడు అనార్ సింగ్ మాత్రమే ఉన్నాడు.

అయితే మరణించిన నాతిభాయ్ పేరిట 5 లక్షల రైతుభీమా మంజూరు అయింది. ఈ విషయం తెలుసుకున్న చిన్న కుమారుడు అనార్ సింగ్ రైతు భీమా, ఆస్తి కోసం తండ్రితో గొడవ పడడం స్టార్ చేశాడు. అయితే హన్మంత్ నాయక్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న అనార్ సింగ్ పథకం ప్రకారం ఇంటి మెయిన్ డోర్ కు తాళం వేసి పైకప్పుకు ఉండే రంధ్రం నుండి పెట్రోల్ పోసి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి ఆయన రెండో భార్య వాళ్ల పిల్లలపై నిప్పంటించాడు.

దీంతో పడుకున్న చోటే సర్పంచ్ రమణి భాయ్, భర్త హన్మంత్ నాయక్, కుమారుడు వెంకటేష్ లకు నిప్పంటుకొని తీవ్ర గాయాలు అయ్యాయి. మరో కుమారుడు శివకు స్వల్ప గాయాలు అయ్యాయి. సర్పంచ్ నివాసంలో మంటలు చెలరేగడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకన్న పైర్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పి బాధితులను హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కలహాలు,ఆస్తి తగాదాలే దాకిడి కారణంగా నిర్దారించారు.

మరిన్ని తెలంగాణ  వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
TV9 సమ్మిట్‌లో పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ ..
TV9 సమ్మిట్‌లో పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ ..
నారింజ పండు.. పోషకాలు మెండు.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
నారింజ పండు.. పోషకాలు మెండు.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. తోపులైనా తోకముడవాల్సిందే..!
ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. తోపులైనా తోకముడవాల్సిందే..!
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..