ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. అంతే కాకుండా తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది. తన అనుభావాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగ పడే ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు.
అనుభవాలు
అవి ఈ తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. వాటి నుంచి చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. ఇక చాణక్యుడు ప్రతి ఒక్కరూ నాలుగు పనుల తర్వాత తప్పక స్నానం చేయాలని చెప్పడం జరిగింది.
నేటి తరం
ఏ వ్యక్తి అయినా సరే తప్పకుండా, నాలుగు పనుల తర్వాత స్నానం చేయాలి? లేకపోతే అరిష్టం చుట్టుకుంటుంది అని తెలియజేశాడు. కాగా, ఆ నాలుగు పనులు ఏవో చూద్దాం.
నాలుగు పనులు
ఆడవారు అయినా సరే మగవారు అయినా సరే చనిపోయిన వారి అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట. దీని వలన మనసు, శరీరం రెండూ శుద్ధి అవుతాయి.
అంత్యక్రియలు
అదే విధంగా ఈ మధ్య చాలా మంది ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నారు. అయితే ఆయిల్ మసాజ్ తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట. దీని వలన బాడీ రిలాక్స్ అవుతుంది.
ఆయిల్ మసాజ్
అలాగే, హెయిర్ కట్ తర్వాత కూడా స్నానం తప్పని సరి అని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు, దీని వలన చర్మం పై ఉన్న చిన్న చిన్న హెయిర్ తొలిగిపోయి, ఇన్ఫెక్షన్స్ రావు.
హెయిర్ కట్
స్త్రీ,పరుషుల కలయిక తర్వాత కూడా తప్పకుండా స్నానం చేయాలంట. అంతే కాకుండా కొందరు భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తారు ఇది అస్సలే మంచిది కాదంట.