AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 ‘వాట్ ఇండియా థింక్స్‌ టుడే’ సమ్మిట్‌లో ప్రధాని మోదీ స్పీచ్ హైలెట్స్..

విపత్కర పరిస్థితుల్లో నెలకొన్న నేటి తరుణంలో TV9 ఒక అద్భుతమై వేదికగా నిలుస్తోందని ప్రధాని మోదీ కొనియాడారు. అదే సమయంలో యుద్ధాన్ని ప్రస్తావిస్తూ టీవీ నైన్‌కు కంటెంట్‌ ఇచ్చేందుకు పెద్ద పెద్ద దేశాలు పోటీపడుతున్నాయని ప్రధాని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. టీవీ నైన్‌ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొన్నారు.

TV9 'వాట్ ఇండియా థింక్స్‌ టుడే' సమ్మిట్‌లో ప్రధాని మోదీ స్పీచ్ హైలెట్స్..
PM Modi at TV9 Network Summit
Ram Naramaneni
|

Updated on: Mar 24, 2026 | 10:46 AM

Share

ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో భారత్‌ ప్రస్తావన అన్నది సమంజసమని ప్రధాని మోదీ అన్నారు. 2014 నాటి పరిస్థితులను అధిగమించి భారత్‌ నేడు ఒక ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తోందని ప్రధాని వివరించారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటోందని అన్నారు. కరోనా తర్వాత సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంతో అన్ని సవాళ్లను భారత్‌ అధగిమిస్తూనే ఉందని అన్నారు. భారత్‌ శక్తిసామర్థ్యాల చూసి ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయని ప్రధాని తెలిపారు.

ఫిబ్రవరి 28 తర్వాత చోటుచేసుకున్న విపరీత పరిణామాల తర్వాత కూడా భారత్‌ సంకల్పం తీసుకొని అభివృద్ధి పథంలో ముందుకు పోతోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ 23 రోజుల్లో ప్రపంచానికి భారత్‌ తన శక్తి సామర్ధ్యాలు చూపిందని గుర్తు చేశారు. భారత్‌ అన్ని దేశాలకు విశ్వసనీయ భాగస్వామని ప్రధాని తెలిపారు. సంక్షోభ సమయంలో భారత్‌ తన పోరాటపటిమను ప్రదర్శించిందని అన్నారు. పౌరులకు చిన్న కష్టం కూడా రాకుండా చూస్తున్నామని ప్రధాని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో పెట్రో సంక్షోభం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ దేశం గురించి ఆలోచించకుండా తన అధికారం కాపాడుకోవడంపై దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయిల్‌ బాండ్స్ నిర్ణయం తప్పని తెలిసినా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని అన్నారు. నాటి నిర్ణయాన్ని నేడు ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతల నోరు మూతపడిపోతోందని ప్రధాని తెలిపారు.

ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల ప్రభావం ప్రతీ దేశంపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. కొందరు యుద్ధం పేరు చెప్పి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని తెలిపారు. అలాంటి వారికి టీవీ నైన్‌ వేదికగా సంయమనం పాటించమని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. యుద్ధం కొనసాగిన ఈ 23 రోజుల కాలంలో భారత దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. గడిచిన నెల రోజుల్లో రైతుల ఖాతాల్లోకి కిసాన్ సమ్మాన్‌ నిధులు జమ చేసిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు.

2014కు ముందు పది, పదకొండు ఏళ్లు, 2014 తర్వాత పది, పదకొండు ఏళ్లను చూస్తే దేశంలో చోటుచేసుకుంటున్న మార్పును స్పష్టంగా గమనించవచ్చని ప్రధాని మోదీ అన్నారు. ప్రతీ రంగంలో పరివర్తన తెచ్చామని తెలిపారు. గతంలోనూ పథకాల రూపకల్పన జరిగేదని, కానీ ఇప్పుడు పరిణామాలు కూడా కనిపిస్తున్నాయని అన్నారు.

దేశంలో తూర్పు ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు ఉపేక్షించాయని, ఇప్పుడా పరిస్థితి లేదని ప్రధాని మోదీ తెలిపారు. అస్సాం, బిహార్‌, ఒడిశా, యూపీ, బెంగాల్‌ రాష్ట్రాల అభివృద్ధిని ప్రధాని ప్రస్తావించారు. కానీ బెంగాల్‌లో ప్రస్తుతమున్న ప్రభుత్వం అభివృద్ధికి బ్రేకులు వేసిందని అన్నారు. మమత సర్కారు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అడ్డుకున్న విషయాన్ని టీవీ నైన్‌ బంగ్లా ప్రేక్షకులకు తెలుసని వివరించారు. అభివృద్ధిని విస్మరించి రాజకీయాలకు పాల్పడే తీరును మొదలుపెట్టిన పార్టీలు ఆ తప్పుల నుంచి బయటపడలేవని ప్రధాని హెచ్చరించారు.

దేశంలో అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా కాంగ్రెస్ పెట్టుకుందని ప్రధాని అన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్ నుంచి మేకిన్ ఇండియా వరకు ప్రతీ దానిపై కాంగ్రెస్‌ సందేహాలు వ్యక్తం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ దురదృష్టమో, దేశ అదృష్టమోగానీ ప్రతీ సవాల్‌ను భారత్‌ దీటుగా ఎదుర్కొండని అన్నారు. AI సమిట్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు దుస్తులు విప్పుకొని నిరసన తెలపడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతదేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా టీవీ నైన్ నిర్వహిస్తున్న ఈ సమిట్‌ నిలవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. భారత దేశ ప్రజలపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని ఇది మరింత బలపరచాలని కోరారు. దాదాపు 30 నిమిషాల సేపు సాగిన ప్రసంగంలో ప్రధాని మోదీ అనేకసార్లు టీవీనైన్‌ కృషిని అభినందించారు.

Follow Us
TV9 సమ్మిట్‌లో పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ ..
TV9 సమ్మిట్‌లో పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ ..
నారింజ పండు.. పోషకాలు మెండు.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
నారింజ పండు.. పోషకాలు మెండు.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. తోపులైనా తోకముడవాల్సిందే..!
ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. తోపులైనా తోకముడవాల్సిందే..!
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..