Solar CCTV: విద్యుత్ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్ సీసీ కెమెరాలు.. తక్కువ ధరల్లో బెస్ట్ ఫీచర్స్!
Solar CCTV Cameras: సోలార్ సీసీటీవీ కెమెరాలు ప్రస్తుతం కరెంట్ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఉత్తమ భద్రతా పరిష్కారంగా మారాయి. తక్కువ ఖర్చుతో సులభంగా ఇన్స్టాల్ చేసుకునే ఈ స్మార్ట్ కెమెరాలు మీ ఆస్తికి 24 గంటల రక్షణను అందిస్తాయి. తక్కువ ధరల్లోనే మంచి ఫీచర్స్..

Solar CCTV Cameras: ఇప్పటికీ మనం తరచూ వార్తల్లో చూస్తుంటాం.. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు, షాపుల్లో నగదు చోరీలు, పొలాల వద్ద మోటర్లు మాయం కావడం. ఇలాంటి ఘటనలను నివారించేందుకు చాలా మంది సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలు, ఫామ్‌హౌస్‌లు వంటి చోట్ల కరెంట్ లేకపోవడం, వైరింగ్ సమస్యల వల్ల కెమెరాలు ఏర్పాటు చేయడం కష్టమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు సోలార్ సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి.
సోలార్ కెమెరాల ప్రత్యేకత:
ఈ కెమెరాలకు విద్యుత్ కనెక్షన్ అవసరం లేదు. వీటిపై ఉండే చిన్న సోలార్ ప్యానెల్ పగటిపూట సూర్యరశ్మితో బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అందువల్ల రాత్రిపూట కూడా కెమెరా ఆపకుండా పనిచేస్తుంది. ఇల్లు, షాపు, గోదాం లేదా పొలం, ఇలా ఎక్కడైనా వీటిని సులభంగా అమర్చుకోవచ్చు.
నెట్ లేకపోయినా పనిచేస్తాయి:
వై-ఫై అందుబాటులో లేని ప్రాంతాల కోసం 4G సిమ్ సపోర్ట్ ఉన్న మోడల్స్ కూడా ఉన్నాయి. వీటితో మీరు ఎక్కడ ఉన్నా మొబైల్ ఫోన్ ద్వారా లైవ్ వీడియోను వీక్షించవచ్చు. అంతేకాకుండా వర్షం, ఎండను తట్టుకునేలా IP66 రేటింగ్‌తో ఇవి తయారు చేస్తున్నారు.
కొనుగోలు ముందు చూసుకోవాల్సిన ఫీచర్లు:
సోలార్ CCTV కొనాలనుకుంటే ఈ అంశాలు తప్పనిసరిగా పరిశీలించాలి:
- కనీసం 3MP లేదా 5MP రిజల్యూషన్
- కలర్ నైట్ విజన్ (రాత్రిపూట కూడా స్పష్టమైన వీడియో)
- PTZ ఫీచర్ (మొబైల్ ద్వారా కెమెరా తిప్పే సౌకర్యం)
- మోషన్ డిటెక్షన్ అలర్ట్స్
- మంచి బ్యాటరీ బ్యాకప్
ఇది కూడా చదవండి: SBI: ఎస్బీఐలో అదిరిపోయే స్కీమ్.. ఒకేసారి పెట్టుబడి పెడితే చాలు.. నెలకు రూ. 11 వేల ఆదాయం!
ధరలు, ఆఫర్లు
ప్రస్తుతం Amazon, Flipkart వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో సోలార్ కెమెరాలపై మంచి డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
- బేసిక్ మోడల్స్ ధరలు: సుమారు రూ.4,000 నుంచి ప్రారంభం
- అడ్వాన్స్డ్ మోడల్స్: రూ.6,000 – రూ.10,000 మధ్య అందుబాటులో
Godrej వంటి బ్రాండ్లు వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తోంది. అదనంగా ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులతో 10% వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. కెమెరా కొనుగోలు చేసే ముందు కనీసం 1 సంవత్సరం వారంటీ ఉండేలా చూసుకోవడం మంచిది. అలాగే మీ అవసరాలకు సరిపోయే ఫీచర్లు ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం అవసరం.
ఇది కూడా చదవండి: Chicken Prices: మాంసం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. కిలో చికెన్ ధర రూ.400
సోలార్ సీసీటీవీ కెమెరాలు ప్రస్తుతం కరెంట్ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఉత్తమ భద్రతా పరిష్కారంగా మారాయి. తక్కువ ఖర్చుతో సులభంగా ఇన్స్టాల్ చేసుకునే ఈ స్మార్ట్ కెమెరాలు మీ ఆస్తికి 24 గంటల రక్షణను అందిస్తాయి.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు పండగే.. పండగ.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం, వెండి ధరలు
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




