Telangana: టెన్షన్.. టెన్షన్.. మంచిర్యాల జిల్లాలో మళ్లీ భూ ప్రకపంనలు

మంచిర్యాల జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు టెన్షన్ రేపాయి. మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.

Telangana:  టెన్షన్.. టెన్షన్..  మంచిర్యాల జిల్లాలో మళ్లీ భూ ప్రకపంనలు
Earthquake
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 01, 2021 | 8:17 AM

మంచిర్యాల జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు టెన్షన్ రేపాయి. మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. స్వల్ప భూప్రకంపనలు స్థానికులకు ముచ్చెమటలు పట్టించాయి. ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వరుస ప్రకంపనలతో జనాల్లో భయాందోళనలు నెలకున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి కేంద్రంగా స్వల్ప భూకంపం నమోదయినట్లు అధికారులు గుర్తించారు. మాగ్నిట్యూడ్ 4.3గా నమోదయ్యింది.

కాగా కొమురంభీం జిల్లా కౌటాల మండలంలో ఆదివారం సాయంత్రం 5.50 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు, కుర్చీలు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు టెన్షన్ పడ్డారు. స్వల్పంగా భూమి కంపించడంతో జనం ఆందోళనతో ఇళ్లనుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. పెంచికల్‌పేట్‌ మండలంలోని మొట్లగూడ, బొంబాయిగూడ, జిల్లెడ, ముర్లిగూడ గ్రామాల్లో రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి 3 సెకన్ల పాటు కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  బెజ్జూరు మండలంలోని బెజ్జూరు, సుశ్మీర్‌,  అందుగులగూడ, డబ్బాగూడ, సలుగుపల్లి, కుశ్నపల్లి, హేటిగూడ, నాగుల్వాయి, బారేగూడ, పాపన్‌పేట్‌, సులుగుపల్లి, కుకుడ, పోతపల్లి, సోమినితదితర గ్రామాల్లో భూమి కంపించింది. ఆదివారం రాత్రి 6.44 నిమిషాలకు రెండు సెకండ్లు భూమి కదిలింది.

కాగా అక్టోబర్ 23న కూడా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు నమోదు. అప్పుడు మాగ్నిట్యూడ్ 4గా నమోదయ్యింది.

Also Read: పవన్ డెడ్‌లైన్‌పై వైసీపీ కౌంటర్.. రివర్స్ పంచ్ వేసిన అంబటి..