AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: అతిపెద్ద మెట్రో కారిడార్ ఇదే.. ఎక్కువ సీట్లతో కోచ్ లు.. 8 నిమిషాలకు ఓ రైలు..

హైదరాబాద్ మహానగరం రోజురోజుకు మరింత అభివృద్ధి చెందతూ విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు అత్యాధునికమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే మూడు ప్రధాన మార్గాల్లో మెట్రో రైళ్లు...

Hyderabad Metro: అతిపెద్ద మెట్రో కారిడార్ ఇదే.. ఎక్కువ సీట్లతో కోచ్ లు.. 8 నిమిషాలకు ఓ రైలు..
Hyderabad Metro Train
Ganesh Mudavath
|

Updated on: Dec 10, 2022 | 5:20 PM

Share

హైదరాబాద్ మహానగరం రోజురోజుకు మరింత అభివృద్ధి చెందతూ విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు అత్యాధునికమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే మూడు ప్రధాన మార్గాల్లో మెట్రో రైళ్లు సర్వీసులు అందిస్తుండగా.. మరో మార్గాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రారంభ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. మెట్రో.. మరిన్ని ప్రాంతాలకు విస్తరించే రెండోదశ ప్రాజెక్ట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపనతో ఆయా ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్‌ నుంచి సిటీలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని ఉన్నతోద్యోగులు నిత్యం పెద్ద సంఖ్యలో విమానాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోతో వీరు 26 నిమిషాల్లో విమానాశ్రయం చేరుకోవచ్చు.

దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు శంషాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌ వద్ద దిగి గచ్చిబౌలికి వస్తుంటారు. మెట్రో నిర్మాణం పూర్తైతే వీరి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ మెట్రో.. నాగోల్‌ – రాయదుర్గం కారిడార్‌-3 కు కొనసాగింపుగా ఉంటుంది. ఈ కారిడార్‌ – 3 తో ఇప్పటికే కారిడార్‌ 1, 2.. అమీర్‌పేట, ఎంజీబీఎస్‌, పరేడ్‌గ్రౌండ్స్‌ వద్ద అనుసంధానమై ఉన్నాయి. రెండో దశ మెట్రోలో తొలి భాగంలో 21 కిలోమీటర్లు మార్గం నిర్మించనున్నారు. ఇందులో ఒకటే కారిడార్ ఉండేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు.

120 కిలోమీటర్లు గరిష్ట వేగంతో, నిత్యం 70 నుంచి 80వేల ప్రయాణీకులు ప్రయాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఎక్కువ సీట్లతో కోచ్ లు ఉండేలా, ఒక్కో మెట్రోలో 3 కోచ్ లు ఉండేలా నిర్మిస్తున్నారు. ఆ కోచ్ లు ఆగేలా స్టేషన్లు, ఆకాశ, భూగర్భ , భూ మార్గాల్లో ట్రాక్ ను నిర్మిస్తారు. వ్యయం రూ.6,250కోట్లుగా అంచనా వేస్తున్నారు. 3 సంవత్సరాలో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రద్దీ వేళల్లో 8 నిమిషాలకు ఒక మెట్రో.. రద్దీ లేని సమాల్లో 20 నిమిషాలకు ఓ మెట్రో నిర్మించాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి