AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పాఠశాల విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఏడాదిలో 10 రోజుల పాటు

TS School Academic Calendar 2023-2024: ఈసారి స్కూల్స్ రీ ఓపెన్‌కు వారం రోజులు ముందుగానే తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ వచ్చేసింది. అందులో రోజూ 30 నిమిషాలపాటు పిల్లలతో పుస్తకాలు చదివించాలని పేర్కొన్నారు. అవి పాఠ్య, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజైన్లు తదితరాలు కావొచ్చని వెల్లడించారు.

Telangana: పాఠశాల విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఏడాదిలో 10 రోజుల పాటు
వరదలు, వర్షాలు.. వైరల్ ఫీవర్లు.. ఇలా కారణాలు ఏదైనా కూడా ఈ ఏడాది స్కూళ్లకు, కాలేజీలకు భారీగానే సెలవులు వచ్చేశాయ్. మొన్నటికి మొన్న జూలైలో అకాల వర్షాలు కురువడం వల్ల అనుకోని విధంగా 10 రోజుల పాటు కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు వచ్చాయి.
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2023 | 4:12 PM

Share

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రతి నెలా 4వ శనివారంను నో బ్యాగ్ డే కింద అనౌన్స్ చేసింది. అంటే ఆ రోజున స్టూడెంట్స్.. పుస్తకాల బ్యాగు లేకుండానే స్కూల్‌కు రావాలి.  ఆరోజు పిల్లలతో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై త్వరలో విధివిదానాలు జారీ చేయనున్నారు. ఈ లెక్కన విద్యా సంవత్సరంలో పిల్లలు మొత్తం 10 రోజుల పాటు బ్యాగులు లేకుండా పాఠశాలకు వస్తారు. ఇక 2023-24 సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ హైలెట్స్ ఇప్పుడు చూద్దాం..

  1.  డైలీ స్కూల్‌ అసెంబ్లీకి ముందు లేదా తర్వాత క్లాస్ రూమ్‌లో 5 నిమిషాలు యోగా, ధ్యానం నిర్వహించాలి.
  2. వారానికి 3 నుంచి 5 పీరియడ్లు గేమ్స్‌కు కేటాయించాలి.
  3. రోజూ 30 నిమిషాలపాటు పుస్తకాలు చదివించాలి.
  4. పదో తరగతి సిలబస్‌ 2024 జనవరి 10 నాటికి కంప్లీట్ చేయాలి
  5. దసరా సెలవులు పోయిన సంవత్సరం 14 రోజులు ఉండగా ఈసారి 13 రోజులే (అక్టోబరు 13 నుంచి 25 వరకు)
  6. క్రిస్మస్‌ సెలవులు కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు ( డిసెంబరు 22 నుంచి 26)
  7. సంక్రాంతి సెలవులు  2024 జనవరి 12 నుంచి 17 వరకు ఇచ్చారు
  8. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలి.
  9.  ఈ విద్యా సంవత్సరం మొత్తం పనిదినాలు : 229
  10. చివరి పనిదినం 2024 ఏప్రిల్‌ 23
  11. వేసవి సెలవులు: ఏప్రిల్‌ 24 – జూన్‌ 11
  12. పాఠశాలలు పునఃప్రారంభం:  2024 జూన్‌ 12

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..