తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు!
గత కొద్ది రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతోన్న సంగతి తెలిసిందే. ఇక రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు అనే ప్రాంతాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. ఉత్తర ఇంటీరియర్ ఒడిశాని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన..
గత కొద్ది రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతోన్న సంగతి తెలిసిందే. ఇక రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు అనే ప్రాంతాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. ఉత్తర ఇంటీరియర్ ఒడిశాని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన బంగాళాఖాతం మీదుగా వాయు తుఫాను సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉంది. దీంతో ఆగష్టు 23 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉంది. ఇక ఆగష్టు 23న మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, ఖమ్మం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, జనగామ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రెండు రోజులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read More:
సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోన్న ”వి” సినిమా