ది బెస్ట్ మెగా సిటీగా ఫస్ట్ ప్లేస్‌లో హైదరాబాద్
ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్-2020 అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బెస్ట్ మెగా సిటీగా ప్రథమ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ 2020 సిటిజెన్స్ ఫీడ్ బ్యాక్ కేటగిరిలో బెస్ట్ మెగా సిటీ ర్యాంకును..
ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్-2020 అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బెస్ట్ మెగా సిటీగా ప్రథమ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ 2020 సిటిజెన్స్ ఫీడ్ బ్యాక్ కేటగిరిలో బెస్ట్ మెగా సిటీ ర్యాంకును పాందినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ”40 లక్షల జనాభా ఉన్న నగరంలో నిర్వహించిన సిటిజెన్స్ ఫీడ్ బ్యాక్ కేటగిరిలో గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక పరిశుభ్రమైన నగరంగా దేశంలోనే ఇండోర్ పట్టణం తొలి స్థానంలో నిలవగా, గ్రేటర్ హైదరాబాద్ 23వ స్థానంలో నిలిచింది. గతేడాది హైదరాబాద్ నగరం 35వ స్థానంలో ఉంది. ఇప్పుడు ముంబై, బెంగుళూరు నగరాలను దాటి.. హైదరాబాద్ నగరం మెరుగైన స్థానాన్ని సంపాదించుకుందని” బొంతు రామ్మోహన్ ట్వీట్ చేశారు.
Happy to share with you all that we are “Best Mega City in Citizen Feedback” (above 40 Lakh population) category. Also we are 23 position in Swachh Survekshan Ranks as against 35 in 2019. We @GHMCOnline will try to better the position in the coming time. Congrats all.@KTRTRS pic.twitter.com/4RDOQKLItz
— Dr BonthuRammohan,Mayor (@bonthurammohan) August 20, 2020
Read More:
సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోన్న ”వి” సినిమా