సుశాంత్ కేసులో సీబీఐ రియా చక్రవర్తిని అరెస్టు చేస్తుందా ?

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్టు చేస్తారా అని ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఆమె అతడిని వ్యక్తిగతంగా గానీ..

సుశాంత్ కేసులో సీబీఐ రియా చక్రవర్తిని అరెస్టు చేస్తుందా ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 20, 2020 | 7:07 PM

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్టు చేస్తారా అని ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఆమె అతడిని వ్యక్తిగతంగా గానీ, ఆర్థికపరంగా గానీ ఛీట్ చేసిందని నిరూపించగలిగితే అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే సుశాంత్ సూసైడ్ చేసుకునేలా ఆయన్ను ప్రోత్సహించిందని ఆధారాలు చూపగలిగితే కూడా అరెస్టు చేయవచ్చు అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ క్లిష్టమైన కేసులో ఇలాంటి ఆధారాలు సేకరించడం అంత సులభం కాదు.. ఎలా చూసినా ఇందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయన్నది మరికొందరి వాదన. కేవలం ఈ విధమైన ఆరోపణలపై ఆమెను అరెస్టు చేసే సూచనలు లేవని సీబీఐ మాజీ డైరెక్టర్ ఏపీ సింగ్ అన్నారు. సుశాంత్ మరణానికి వారం రోజుల ముందే రియా చక్రవర్తి అతని ఇంటి నుంచి వెళ్ళిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రియా జూన్ 8 న ఆ ఇంటి నుంచి వెళ్లిపోగా జూన్ 14 న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటు-ముంబై చేరుకున్న సీబీఐ అధికారులు నగర పోలీసులనుంచి ఈ కేసు తాలూకు డాక్యుమెంట్లను సేకరించడం ప్రారంభించారు.