AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టపగలు బీజేపీనేతను కాల్చిచంపిన దుండగులు

ఝార్ఖండ్‌లో పట్టపగలే దారుణం జరిగింది. ఓ బీజేపీ నాయకుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చిచంపారు. అందరు చూస్తుండగానే సినీపక్కీలో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

పట్టపగలు బీజేపీనేతను కాల్చిచంపిన దుండగులు
Balaraju Goud
|

Updated on: Aug 20, 2020 | 7:34 PM

Share

ఝార్ఖండ్‌లో పట్టపగలే దారుణం జరిగింది. ఓ బీజేపీ నాయకుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చిచంపారు. అందరు చూస్తుండగానే సినీపక్కీలో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దన్‌బాద్‌లోని బాక్‌మోర్‌ ప్రాంతంలో భారతీయ జనతాపార్టీ నగర ఉపాధ్యక్షుడు సతీశ్‌ సింగ్‌ కారు దిగి సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుండగా.. ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అయన్ను అనుసరించారు. తిరిగి చూసేలోగానే సమీపం నుంచి తలపై తుపాకీతో కాల్చి పరారయ్యారు. సతీశ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రామ్‌కుమార్‌ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మృతుడి సన్నిహితుడు, స్థానిక ఎమ్మెల్యే రాజ్‌ సిన్హా ఇది రాజకీయ హత్యేనని ఆరోపించారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా