తెలంగాణలో కొత్త సమస్య..! బ్లాక్ ఫంగస్‌తో ఒకరి మృతి.. ఇప్పటికే గాంధీలో 3 కేసులు..?

Black Fungus in Telangana : తెలంగాణలో కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటికే కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్

తెలంగాణలో కొత్త సమస్య..! బ్లాక్ ఫంగస్‌తో ఒకరి మృతి.. ఇప్పటికే గాంధీలో 3 కేసులు..?
Black Fungus
uppula Raju

|

May 14, 2021 | 9:50 AM

Black Fungus in Telangana : తెలంగాణలో కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటికే కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) విజృంభిస్తోంది. నిర్మల్ జిల్లా భైంసాలోని గణేష్‌నగర్‌కు చెందిన తోట లింగురామ్ అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో మరణించాడు. అతడికి ఇటీవలే కరోనా కూడా సోకింది. చికిత్స అనంతరం కోవిడ్ నుంచి కోలుకున్నాడు. తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ముక్కు, కళ్ల నుంచి ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించిందని ఈక్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశాడు.

గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురు కరోనా రోగుల్లోనూ దీనిని గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా, ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉంది. మరి కొందరు ఈ తరహా లక్షణాలతో వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలలో చేరుతున్నారు. సంబంధిత వైద్య వర్గాలు మాత్రం నిర్ధారించలేదు. నిర్మల్‌ జిల్లాకే చెందిన మరో ఐదుగురు బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందులో కుబీర్ మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నాయి. 2వేల మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. మహారాష్ట్రకు పక్కనే నిర్మల్ జిల్లా ఉండడం.. ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. ఈ కేసులు కూడా ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చాయని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులు బ్లాక్ ఫంగస్ కేసులను గాంధీ ఆసుపత్రికి పంపుతామని అడుగుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయనడంలో వాస్తవం లేదని రమేశ్ రెడ్డి అన్నారు. అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదని ఆయన వివరించారు. హైడోస్ స్టెరాయిడ్స్ వాడే కొందరిలో మాత్రం ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కొవిడ్ ఎఫెక్ట్..! ఆ గ్రామంలో 25 రోజుల్లో 35 మరణాలు.. 70 శాతం మందికి కరోనా లక్షణాలు..?

Airports Guidelines: కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ మార్గదర్శకాలు.. విదేశీ ప్రయాణికులకు విధిగా 14 రోజుల క్వారంటైన్‌

కస్టమర్లకు అలర్ట్… పోస్టాఫీస్ వర్క్ టైమింగ్స్ మారాయి..రోజుకూ కొన్ని గంటలే పనిచేయనున్న కార్యాలయాలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu