కొవిడ్ ఎఫెక్ట్..! ఆ గ్రామంలో 25 రోజుల్లో 35 మరణాలు.. 70 శాతం మందికి కరోనా లక్షణాలు..?

35 Deaths in 25 Days : బీహార్‌లో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం మే 25 వరకు లాక్డౌన్ పొడిగించింది. కానీ

కొవిడ్ ఎఫెక్ట్..! ఆ గ్రామంలో 25 రోజుల్లో 35 మరణాలు.. 70 శాతం మందికి కరోనా లక్షణాలు..?
Bamhaur Khas Village


35 Deaths in 25 Days : బీహార్‌లో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం మే 25 వరకు లాక్డౌన్ పొడిగించింది. కానీ రాష్ట్ర రాజధాని నుంచి 195 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైమూర్ జిల్లాలోని బంహౌర్ ఖాస్ గ్రామంలో కొవిడ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. కైమూర్ జిల్లాకు చెందిన అధికారిక గణాంకాల ప్రకారం.. తాజాగా ఆ గ్రామంలో 23 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. అయితే మరణాల సంఖ్య గురించి ప్రస్తావించలేదు. బమ్హౌర్ ఖాస్‌ గ్రామంలో గత 25 రోజులలో 34 మరణాలు సంభవించాయి. సాధారణం కంటే ఎక్కువ. 70 శాతం మంది అనారోగ్యంతో ఉన్నారని గ్రామస్థలు చెబుతున్నారు.

కొవిడ్ పరీక్షా ఫలితాలు రాకముందే చాలా మంది ప్రజలు కోవిడ్ లక్షణాలతో మరణించారని, కొన్నిసార్లు పరీక్షలే చేయలేదని గ్రామస్తులు అంటున్నారు. “మొదట జ్వరం వచ్చింది. తర్వాత దగ్గు వచ్చింది అంతే ఆమె మరణించింది. కరోనా పరీక్షను చేయించాం కానీ రిపోర్ట్ రాకముందే చనిపోయిందని అత్తను కోల్పోయిన అశోక్ కుమార్ చౌదరి అనే వ్యక్తి చెప్పారు. మరో గ్రామస్తుడు అలోక్ కుమార్ సింగ్ రెండో మోతాదు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా మృతిచెందాడు.”రెండో టీకా తరువాత అతనికి జ్వరం వచ్చింది. అతడు హార్ట్ పేషెంట్, షుగర్ కూడా ఉంది. ఆస్పత్రికి తీసుకెళ్లాం అక్కడ ఇంజెక్షన్ ఇచ్చారు కానీ బయటపడలేదు” అని అతడి కుమారుడు చెప్పారు.

ఇంత తక్కువ సమయంలో ఇన్ని మరణాలు ఎప్పుడు జరగలేదు. ఇవి కరోనావైరస్ వల్ల సంభవించాయని మాకు తెలుస్తుందని గ్రామస్థలు చెబుతున్నారు. చాలా మంది ప్రజలు కోవిడ్ లాంటి లక్షణాలను కలిగి ఉండగా వారు మొదట్లో మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేసుకున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో కొవిడ్ టెస్ట్‌లు చేయకపోవడం వల్ల వారి మరణానికి కరోనా కారణమని తెలియకుండా ఉందని పలువురు చెబుతున్నారు.70 శాతం మంది ప్రజలు అనారోగ్యంతో ఉన్నారని గ్రామస్తులు చెబుతుండగా, ఈ సమస్య తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. మరోవైపు వందలాది శవాలు గంగా నదిలో తేలుతున్నాయి. ఇది బీహార్, ఉత్తర ప్రదేశ్ మధ్య వివాదానికి దారితీసింది.

కస్టమర్లకు అలర్ట్… పోస్టాఫీస్ వర్క్ టైమింగ్స్ మారాయి..రోజుకూ కొన్ని గంటలే పనిచేయనున్న కార్యాలయాలు..

Powerful Earthquake: జపాన్‌ను వణికించిన భారీ భూ ప్రకంపనలు.. ఒక్కసారిగా హడలిపోయిన ప్రపంచ దేశాలు..! ఎందుకో తెలుసా..!

కల్లు కంపౌండ్ మహిళలే అతడి టార్గెట్..! ఇప్పటి వరకు 19 మంది మహిళలపై అత్యాచారం, దోపిడీ..