Telangana: డ్రగ్స్ ముఠాలను పట్టుకునేందుకు పోలీసుల కొత్త ప్లాన్.. ఐడియా అదుర్స్ కదూ..!

డ్రగ్స్‌ మత్తులో యువత... ఇప్పుడు చర్చంతా దీనిపైనే..! చిన్న వయసులోనే మత్తు భూతం వారిని కమ్మేస్తోంది. అయితే వారికి తెలియకుండానే డ్రగ్స్‌ టేస్ట్‌ చేస్తున్నారు. ఈ విషయంలో యువతకు, వారి తల్లిదండ్రులకు కీలక సూచన చేశారు హైదరాబాద్‌ పోలీసులు.

Telangana: డ్రగ్స్ ముఠాలను పట్టుకునేందుకు పోలీసుల కొత్త ప్లాన్.. ఐడియా అదుర్స్ కదూ..!
Director Of Excise Enforcement Kamalasan Reddy
Follow us
Vijay Saatha

| Edited By: Balaraju Goud

Updated on: Aug 30, 2024 | 8:24 PM

డ్రగ్స్‌ మత్తులో యువత… ఇప్పుడు చర్చంతా దీనిపైనే..! చిన్న వయసులోనే మత్తు భూతం వారిని కమ్మేస్తోంది. అయితే వారికి తెలియకుండానే డ్రగ్స్‌ టేస్ట్‌ చేస్తున్నారు. ఈ విషయంలో యువతకు, వారి తల్లిదండ్రులకు కీలక సూచన చేశారు హైదరాబాద్‌ పోలీసులు.

పార్టీ అంటూ, సెలబ్రేషన్స్ అంటూ మన పిల్లలు వెళ్తూ ఉంటారు. అంతా తెలిసిన వాళ్లే కదా అని మనమూ పెద్దగా అబ్జెకన్‌ చెప్పం. కానీ.. తీరా అక్కడికి వెళ్లాక.. తాగే వెల్‌కమ్ డ్రింక్‌లో ఫ్రూట్‌ ఫ్లేవరే ఉంటుందో, డ్రగ్స్ ఫ్లేవరే ఉంటుందో తెలీదు. సరదాగా పంచుకునే చాక్లెట్లలో ఎంత క్వాంటిటీ మత్తు దాగి ఉంటుందో తెలీదు. చివరికి కూల్‌ కూల్‌గా చిల్ అవుదామని ఐస్‌ క్రీమ్ తీసుకుంటే అందులో ఉండే ఫ్లేవర్.. వెనీలా, బటర్‌స్కాచ్‌, స్ట్రాబెరీ లాంటివి అయితే ఫర్వాలేదు. పొరపాటున హెరాయిన్, కొకైన్, యాంఫిటమైన్‌ లాంటివి అయితే పరిస్థితి ఏంటి? అవును పోలీసులు చేస్తున్న వార్నింగ్ ఇదే.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని అదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ హైదరాబాద్‌, రంగారెడ్డి, ఎస్‌టిఎఫ్ టీమ్‌లకు టీజీ న్యాబ్‌ ఉన్నతాధికారులు కీలక సూచనలు, సలహాలు అందించారు. శుక్రవారం అబ్కారీ భవన్‌లో ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టీజీ న్యాబ్‌ ఎస్పీలు చైతన్య, సీతరామ్ తదితరులు హాజరయ్యారు. డ్రగ్స్‌ కోసం దాడులు, తనిఖీలు నిర్వహించే సమయంలో నేరస్థులను ఎలా గుర్తించాలి, డ్రగ్స్‌ను ఎలా వినియోగిస్తారు. ఎక్కడ తీసుకుంటారు. డ్రగ్స్‌ తీసుకున్న వారి ప్రవర్తన ఎలా ఉంటుంది. వారిని ఎలా గుర్తించాలి, గుర్తించిన వారిపై 12 బ్యారల్‌ డ్రగ్‌ డిటేక్షన్‌ కిట్స్‌తో ఎలా పరీక్షలు నిర్వహించాలి అనే విషయాలను టీజీ న్యాబ్‌కు సంబంధించిన అధికారులు వివరించారు.

డ్రగ్స్‌ డిటేక్షన్‌ కిట్‌తో పరీక్షలు నిర్వహించినపుడు పాజిటివ్‌ వస్తే ఏమి చేయాలి, నెగిటివ్‌ వస్తే ఏమి చేయాలి. అనే విషయంపై ఎక్సైజ్‌ పోలీసులకు వివరించారు. వీటితోపాటు డ్రగ్స్‌పై టీజీ న్యాబ్‌తో కలిసి ఎక్సైజ్‌ శాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను డైరెక్టర్‌ అదేశించారు. తనిఖీలకు వెళ్లే ముందు పరిసరాలను మన అధీనంలోకి తీసుకోవాలని, ఎంట్రెన్స్‌, ఎగ్జిట్‌ను అధీనంలోకి తీసుకున్న అనంతరం పార్కింగ్‌ ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెంచి తనిఖీలు చేపట్టాలని సూచించారు. టీజీ న్యాబ్‌ ఇచ్చిన సలహాలను సూచనలను ఎక్సైజ్‌శాఖ యంత్రాంగం అవగహన చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. టీజీ న్యాబ్‌ అధికారులు ఇచ్చిన సూచనలను సలహాలను ఎక్సైజ్‌ యంత్రాంగం పాటిస్తూ మంచి ఫలితాలను సాధించాలని డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..