Telangana: తెలంగాణలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీ.. సంకేతాలు ఇచ్చిన డిప్యూటీ సీఎం

యాదాద్రి పవర్ ప్లాంట్ కు రామగుండం నుండి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్ వ్యాగిన్ కు జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు.

Telangana: తెలంగాణలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీ.. సంకేతాలు ఇచ్చిన డిప్యూటీ సీఎం
Ytpp Plant
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Nov 03, 2024 | 5:09 PM

త్వరలో నూతన ఎనర్జీ పాలసీని తీసుకు వచ్చేందుకు తెలంగాణ సర్కారు సన్నాహాలు చేస్తోంది. నూతన ఎనర్జీ పాలసీతో అన్ని వర్గాలకు ఉపయుక్తంగా ఉండేలా రూపకల్పన జరుగుతోంది. ఇందుకోసం విద్యుత్ రంగంలో నిష్ణాతులు మేధావులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 35 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు సందర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు రామగుండం నుండి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్ వ్యాగిన్ కు జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు. ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ ను మంత్రులు ప్రారంభించారు.

ఇప్పటికే రెండవ యూనిట్‌ను సెప్టెంబర్ 11న సింక్రనైజేషన్‌ను ప్రారంభించారు. త్వరలో ఎనర్జీ పాలసీని తీసుకు రానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. నూతన పాలసీపై అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఈ నూతన పాలసీని తీసుకువస్తున్నట్లు భట్టి వెల్లడించారు. 2034-35 నాటికి రాష్ట్రంలో 31,809 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌కు అవకాశం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనికి అనుగుణంగా విద్యుత్ ఉత్పాదకతను పెంచుతామని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు కొరత లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అన్నారు.

గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తికి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని భట్టి తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ద్వారా 2025 మార్చి నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రీడ్ కు అనుసంధానం చేస్తామని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..