Viral: ‘ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం’.. వారిపై మండిపడ్డ సజ్జనార్‌

కొందరు యువకుల తీరపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మండిపడ్డారు. దీపావళి పండుగ రోజున వారు చేసిన పనిని తీవ్ర స్థాయిలో ఖండించారు. అసలు సమాజం ఏటు పోతోంది అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ యువకులు ఏం చేశారంటే..

Viral: 'ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం'.. వారిపై మండిపడ్డ సజ్జనార్‌
Sajjanar
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 03, 2024 | 2:21 PM

దీపావళి పండుగను ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. దేశ్యవాప్తంగా సంబరాలు ముగిశాయి. పటాసులు కాల్చుతూ, స్వీట్స్‌ పంచుకుంటూ సరదాగా గడిపారు. అయితే సంతోషాలను పంచే దీపావళి రోజు కొందరు యువకులు మాత్రం పిచ్చిగా ప్రవర్చించారు. తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవడంతో పాటు పక్కవారికి కూడా ఇబ్బందులు పెట్టారు.

దీపావళి పండుగ రోజున రాత్రి హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ రోడ్లపైకి కొందరు యువకులు బైక్‌లో చేరుకున్నారు. అంతటితో ఆగకుండా బైక్‌లపై బాణాసంచాలను కాలుస్తూ, రకరకాల వ్యాసాలు చేశారు. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు స్మార్ట్ ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఈ వీడయోలు కాస్త నెట్టింట ట్రెండ్ అవ్వడం మొదలుపెట్టాయి. దీంతో ఈ వీడియోను తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జానర్‌ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఈ వీడియోను పోస్ట్‌ చేసిన సజ్జనార్‌.. ‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోది. వీడియో చూసిన నెటిజన్లు సైతం యువకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్