Telangana: తాచుపామును చీల్చి చెండాడిన డాబర్మాన్ కుక్కలు.. చచ్చినా దాన్ని వదల్లేదు
సాధారణంగా పాములను చూడగానే ఎవరికైనా భీతి కలుగుతుంది. మనుషులేంటి.. అడవికి రాజు అయిన సింహాం కూడా పామును చూసి తోకముడిచిన సందర్బాలు ఉన్నాయి. కానీ రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్లో రెండు డాబర్మాన్ కుక్కలు ఓ భారీ నాగుపామును చీల్చి చెండాడాయి.
డాబర్మాన్.. బ్రీడ్ గురించి పెట్ లవర్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ ఫాస్టెస్ట్ డాగ్స్‌లో ఇది 8వ స్థానంలో ఉంది. ఇది జర్మనీ ప్రాంతానికి చెందినది. దీని వినికిడి శక్తి చాలా పవర్‌ఫుల్. యజమాని రక్షణ కోసం ఇవి ప్రాణాలను పణంగా పెడతాయి. ఈ కుక్కను పోలీసులు నేరస్థులను పట్టుకునేందుకు ఉపయోగిస్తారు. అపరిచితులతో దూకుడుగా ప్రవర్తిస్తుంది. వీటి లైఫ్ టైం.. 10 నుంచి 13 సంవత్సరాలు. ఇలాంటి రెండు డాబర్మాన్ డాగ్స్.. ఓ నాగుపామును చీల్చి చెండాడాయి. ఆ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
తెలంగాణలోని మొగిలిగిద్ద గ్రామం వద్ద ఉన్న పొలంలో యజమాని డాబర్మాన్ కుక్కలను పెంచుకుంటున్నాడు. శుక్రవారం తన పొలంలో పొడవైన పాము ఈ పెట్ డాగ్స్ కంటపడింది. దీంతో ఆ శునకాలకు తిక్క రేగింది. రెండూ కలిసి ఆ పామును అటాక్ చేశాయి. పాముని నోటతో ఎక్కడపడితే అక్కడ కొరికి ప్రాణం తీశాయి. చనిపోయాక కూడా పామును నోట కరిచి.. అటు ఇటు లాగిన విజువల్స్ కనిపించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..