AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year Event: నగరంలో న్యూ ఇయర్ కళ.. నయా రూట్‎లో సరికొత్త దందా

న్యూ ఇయర్‌ పార్టీ.. మందు.. విందు.. చిందు.. జోష్‌ ఫుల్‌ వేడుక. ఈ సరదా సమయంలో మత్తు తోడైతే మజా మరింత పెరిగి పిచ్చిగా మారుతుంది. గమ్మత్తైన అనుభూతిని యువతకు పంచేందుకు కొత్త సంవత్సర వేడుకలు వేదికగా డ్రగ్స్‌ మాఫియా సొమ్ము చేసుకోవాలనుకుంటుంది. పార్టీల పట్ల మోజుండి అందుకు సరిపడా ఆర్ధిక స్థోమత లేని వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

New Year Event: నగరంలో న్యూ ఇయర్ కళ.. నయా రూట్‎లో సరికొత్త దందా
New Year Event
Ranjith Muppidi
| Edited By: Srikar T|

Updated on: Dec 20, 2023 | 9:52 PM

Share

న్యూ ఇయర్‌ పార్టీ.. మందు.. విందు.. చిందు.. జోష్‌ ఫుల్‌ వేడుక. ఈ సరదా సమయంలో మత్తు తోడైతే మజా మరింత పెరిగి పిచ్చిగా మారుతుంది. గమ్మత్తైన అనుభూతిని యువతకు పంచేందుకు కొత్త సంవత్సర వేడుకలు వేదికగా డ్రగ్స్‌ మాఫియా సొమ్ము చేసుకోవాలనుకుంటుంది. పార్టీల పట్ల మోజుండి అందుకు సరిపడా ఆర్ధిక స్థోమత లేని వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉచితంగా పాస్‌లిచ్చి వారితో డ్రగ్స్‌ అమ్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నగర చరిత్రలో తొలిసారి ఈ తరహా దందాకు మత్తు వ్యాపారులు తెరతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెంట్‌ నిర్వాహకుల సహకారంతో కొన్ని చోట్ల డ్రగ్స్‌ విక్రయాలు జరగనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వారికి సమాచారం లేకుండా రహస్యంగా అమ్మేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

న్యూ ఇయర్‌ వేడుకలను టార్గెట్ చేసుకుని.. డ్రగ్స్‌ను భారీ స్థాయిలో విక్రయించేందుకు మఠాలు నగరానికి చేరుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఓ వైపు పోలీసులు ఎన్నికల హడావిడి లో ఉండగా.. అదే అనువుగా భావించిన డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్‎కు భారీగా డ్రగ్స్ చేరవేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో డ్రగ్ పెడలర్స్ కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. డ్రగ్స్‌ తరలించే అన్ని మార్గాలపైనా పోలీసులు దృష్టి సారించారు. అయితే.. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్ పెడలర్స్ వాటిని చేర్చాల్సిన చోటుకి చేర్చేస్తున్నారు.

డ్రగ్స్‌ కదలికలపై నిఘా పెట్టిన అధికారులు.. 24గంటల్లోనే నాలుగు చోట్ల భారీగా డ్రగ్స్‎ని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గోవా నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తునట్టు గుర్తించారు. పోలీసులు వీరిని విచారిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. గోవా నుండి పెద్దఎత్తున సిటీకి డ్రగ్స్ సరఫరా జరిగిందని.. రైల్.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులతో పాటు.. కొరియర్స్‎లలో కూడా వాటి వ్యాపారులకు అందిన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఇప్పటికే నగరంలో భారీగా డ్రగ్స్ చేరిందన్న విషయాన్ని సీరియస్‎గా తీసుకుంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

డ్రగ్స్ ఎవరు వినియోగించినా, ఎవరు విక్రయించినా కఠినశిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎవరు డ్రగ్స్ వినియోగించినా కనీసం పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని చెబుతున్నారు. ప్లవర్ బోకేస్, కొరియర్స్‌, గిఫ్ట్ ప్యాక్‎ల ద్వారా కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పట్టుబడ్డ వ్యక్తులు చెప్పడంతో.. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిటీలో కంటే.. నగర శివారు ప్రాంతాల్లో జరిగే వేడుకలకు హజరయ్యేందుకే యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో అక్కడే ఎక్కువగా మాదక ద్రవ్యాల వినియోగం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాటిని సమర్ధవంతంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవ్ పార్టీలు.. వీకెండ్ నైట్స్.. సెలబ్రేషన్స్‎తో పాటు.. రిసార్ట్.. హోటల్స్.. పబ్స్‎పై ప్రత్యేక నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..