Salaar: ఈ హైదరాబాదీ లీడర్‌ రియల్‌ సలార్‌.. ఆ పేరు ఎందుకొచ్చిందంటే..

ఇదిలా ఉంటే సలార్‌ అనే టైటిల్‌ బయటకు రాగానే అందరిలో ఒక క్యూరియాసిటీ మొదలైంది. సలార్‌ అంటే అర్థం ఏంటన్నదానిపై అందరూ చర్చించుకున్నారు. నిజానికి సలార్‌ అంటే ఉర్దూలో నాయకుడు లేదా కమాండర్‌, ఛీఫ్‌ అని అర్థం. సలార్‌ చిత్రం హడావుడి నేపథ్యంలో హైదరాబాదీలు ఒకప్పుడు సలార్‌గా పిలుచుకున్న వ్యక్తి గురించి గుర్తుచేసుంటున్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీకి చెందిన...

Salaar: ఈ హైదరాబాదీ లీడర్‌ రియల్‌ సలార్‌.. ఆ పేరు ఎందుకొచ్చిందంటే..
Salaar
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 20, 2023 | 1:00 PM

సలార్‌.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. అందుకు అనుగుణంగా ప్రీ బుకింగ్స్‌లో ఈ సినిమా సరికొత్త చరిత్రతను సృష్టిస్తూ దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే సలార్‌ అనే టైటిల్‌ బయటకు రాగానే అందరిలో ఒక క్యూరియాసిటీ మొదలైంది. సలార్‌ అంటే అర్థం ఏంటన్నదానిపై అందరూ చర్చించుకున్నారు. నిజానికి సలార్‌ అంటే ఉర్దూలో నాయకుడు లేదా కమాండర్‌, ఛీఫ్‌ అని అర్థం. సలార్‌ చిత్రం హడావుడి నేపథ్యంలో హైదరాబాదీలు ఒకప్పుడు సలార్‌గా పిలుచుకున్న వ్యక్తి గురించి గుర్తుచేసుంటున్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీకి చెందిన ఓ నాయకుడిని సలార్‌గా పిలుచుకునే వారు. ఇంతకీ ఎవరా నాయకుడు.? అంతలా అతను ప్రజలకు ఏం చేశాడు.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

హైదరాబాద్‌లోని ఏఐఎమ్‌ఐఎమ్‌ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీకి జన్మించారు సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడంతో సలావుద్దీన్‌కు చిన్ననాటి నుంచే రాజకీయాలు ఒంటిన పట్టాయి. ఎంతో మంది పేద మస్లింలకు అండగా నిలిచారు సలాదుద్దీన్‌. దాదాపు 4 దశాబ్ధాల రాజకీయ జీవితంలో హైదరాబాద్‌ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఆరుస్లార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పేద ప్రజలకు సలావుద్దీన్‌ చేసిన సేవలకు, వారికి అండగా నిలిచిన విధానికి అప్పటి ప్రజలు.. ఆయనకు ‘సలార్‌ ఎ మిల్లత్‌’ అనే బిరుదును ఇచ్చారు.

దీని అర్థం సమాజ కమాండ్‌ అని.. అనంతరం సలార్‌ అని పిలవడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ ఏఐఎమ్‌ఐఎమ్‌ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండడానికి సలావుద్దీన్‌ది కూడా కీలక పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసదుద్దీన్‌ ఓవైసీ, అక్బరుద్దీన్‌ ఓవైసీలు.. సలాదుద్దీన్‌ కుమారులే. ఎన్నో ఏళ్లపాటు ప్రజా సేవ అందించిన సలాదుద్దీన్‌.. 2008 సెప్టెంబర్‌ 29వ తేదీన తుది శ్వాస విడిచారు. ఇలా ఇన్నేళ్ల తర్వాత సలార్‌ చిత్రం నేపథ్యంలో సలాదుద్దీన్‌ను హైదరాబాదీలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..