Telangana Health Bulletin: హైదరాబాద్లో నమోదైన కోవిడ్ కేసులు.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ఆదేశాలు..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఇప్పటి వరకు జేఎన్.1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఇప్పటి వరకు జేఎన్.1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వైద్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకూ 14 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే కొత్తగా మరో ఆరు కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఈ కేసులన్నీ హైదరాబాద్ పరిదిలోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది.
కోవిడ్ పాజిటివ్ వచ్చి తీవ్రమైన లక్షణాలతో ఉన్న రోగులు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం కరోనా పరీక్షలు, రోగులకు అవసరమైన సదుపాయాలను అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు వివరించింది. దేశ వ్యాప్తంగా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ జేఎన్.1 విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, సానిటైజ్ చేసుకోవడం లాంటివి చేయాలని సూచించింది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు.. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు తప్పనిసరి అయితే తప్ప బయటకు రావొద్దని తెలిపింది. అనవసరమైన ప్రయాణాలకు ఉండాలని పౌరులను అభ్యర్థించింది. జ్వరం, దగ్గు, జలుపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర నొప్పులు, తలనొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచనలు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..