మహేశ్వర మహాపిరమిడ్‌ ముస్తాబు.. ప్రపంచశాంతిని ఆకాంక్షిస్తూ 11 రోజుల పాటు పత్రిజీ మహాధ్యానయాగం..

పిరమిడ్ ధ్యాన కేంద్రాలతో ప్రపంచంలో నేటి యువతకు నవయుగ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్ర చిరునామాగా నిలిచిందన్నారు పత్రిజీ కుమార్తె పరిమళ పత్రీ. సుభాష్ పత్రిజీ సంకల్పంతో ధ్యాన విజ్ఞానాన్ని పిరమిడ్ శక్తితో అనుసంధానం చేసి దశదిశలా వ్యాప్తి చేశామన్నారామె. పత్రిజీ ప్రారంభించిన ధ్యాన, శాకాహార ప్రచారాలు కర్నూలులో ప్రారంభమై విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి.

మహేశ్వర మహాపిరమిడ్‌ ముస్తాబు.. ప్రపంచశాంతిని ఆకాంక్షిస్తూ 11 రోజుల పాటు పత్రిజీ మహాధ్యానయాగం..
Maheswara Maha Pyramid In Kadtal
Follow us
Jyothi Gadda

| Edited By: Rajeev Rayala

Updated on: Dec 20, 2023 | 10:25 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా కడ్తాల్‌లోని కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం..గురువారం(డిసెంబర్‌21) నుంచి ఈనెల 31వరకు వైభవోపేతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రపంచశాంతిని ఆకాంక్షిస్తూ 11 రోజుల పత్రిజీ మహాధ్యాన యోగం నిర్వహించేందుకు పిరమిడ్ స్పిరిచ్యూల్ ట్రస్ట్ సిద్ధమైంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది రుషులు, యోగులతో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో ఏర్పాట్లు ఘనంగా చేశారు.

పిరమిడ్ ధ్యాన కేంద్రాలతో ప్రపంచంలో నేటి యువతకు నవయుగ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్ర చిరునామాగా నిలిచిందన్నారు పత్రిజీ కుమార్తె పరిమళ పత్రీ. సుభాష్ పత్రిజీ సంకల్పంతో ధ్యాన విజ్ఞానాన్ని పిరమిడ్ శక్తితో అనుసంధానం చేసి దశదిశలా వ్యాప్తి చేశామన్నారామె.

పత్రిజీ ప్రారంభించిన ధ్యాన, శాకాహార ప్రచారాలు కర్నూలులో ప్రారంభమై విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి. మహాయాగానికి వచ్చే వాళ్లందరికి అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయన్నారు.

ఇవి కూడా చదవండి

10రోజుల్లో దాదాపు 7 లక్షలమంది ధ్యాన మహాయాగంలో పాల్గొంటారన్న అంచనాలు ఉన్నాయి. ఈసారి యువతను ఆధ్యాత్మిక ధ్యానం వైపు మళ్లించేలా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు నిర్వాహకులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..