తలమీద తలతో పుట్టిన వింత శిశువు.. తల్లిదండ్రులకు బంగారు బాతుగా మారాడు.. చివరకు పాపం..

ఇకపోతే, కాలక్రమేణా ఆ అద్వితీయ బాలుడు బెంగాల్ అంతటా ప్రసిద్ధి చెందాడు. అతని రూపం కారణంగా అతన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వారి ఇంటికి క్యూ కట్టేవారు. ధనవంతులు, సివిల్ సర్వెంట్లు, అధికారులు వంటి ఎందరో ప్రముఖులు కూడా ఆ విచిత్ర బాలుడిని చూసేందుకు వచ్చేవారు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు దాన్ని క్యాష్‌ చేసుకోవాలని భావించారు.

తలమీద తలతో పుట్టిన వింత శిశువు.. తల్లిదండ్రులకు బంగారు బాతుగా మారాడు.. చివరకు పాపం..
Bengal Boy
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 20, 2023 | 8:45 PM

ప్రపంచంలోని ప్రతి దేశంలో ఏదో ఒక విచిత్రం, షాకింగ్ ఘటనకు సంబంధించిన వార్తలు, కథనాలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి కథ ఒకటి భారతదేశంలోని బెంగాల్‌కు సంబంధించినది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగాల్‌లో రెండు తలల బాలుడు ఉదంతం సర్వత్ర ఆసక్తిని కలిగించింది. ఎందుకంటే.. ఆ బాలుడి రెండు తలలు..ఒకదానికి ఒకటి పూర్తిగా తలక్రిందులుగా ఉన్నాయి. దాంతో ఆ బాలుడు పుట్టగానే అతన్ని మంటల్లో పడవేశారు. కానీ అద్భుతంగా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ అద్వితీయ కుర్రాడి గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ బాలుడు పుట్టగానే మంత్రసానిని కూడా భయపెట్టాడు. బాలుడిని చూసి భయపడిన నర్సు అతన్ని మంటల్లో పడేసింది. మంటల్లో పడవేయటంతో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ, రెండు తలల ఈ బెంగాల్ బాలుడు తన తల్లిదండ్రులకు డబ్బు సంపాదించే యంత్రంగా మారిపోయాడు. ఆ వింత బాలుడి పరిస్థితి ఏమిటి? కుటుంబ సభ్యులు అతడి ఎలా డబ్బు సంపాదిస్తున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

bengal boy

bengal boy

ప్రజలు ప్రత్యేకంగా భావించే బాలుడు 1783లో బెంగాల్‌లోని ముండాల్ గ్వాట్‌లో జన్మించాడు. ఈ అద్వితీయ కుర్రాడికి సంబంధించి ఒక ఆంగ్ల వెబ్‌సైట్ అందించిన సమాచారం మేరకు.. తలక్రిందులుగా ఉన్న రెండు తలల బాలుడికి తలలు రెండూ పూర్తిగా స్వతంత్రంగా పని చేస్తున్నాయి. ప్రతి తలకు దాని స్వంత మెదడు ఉంది. ఆ అద్వితీయ కుర్రాడి ఒక తల నిద్రపోతే, మరో తల మెలకువగానే ఉండేదని చెప్పారు. ఆ అబ్బాయికి రెండు తలలు ఉండడంతో తలనొప్పులు వచ్చినప్పుడల్లా ఆ రెండు తలల్లో తలస్నానం చేసేవాడు. ఈ కుర్రాడికి లైట్ హెడ్, చాలా సెన్సిటివ్, కంటి చూపు సరిగా లేదని చెబుతారు.

ఇకపోతే, కాలక్రమేణా ఆ అద్వితీయ బాలుడు బెంగాల్ అంతటా ప్రసిద్ధి చెందాడు. అతని రూపం కారణంగా అతన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వారి ఇంటికి క్యూ కట్టేవారు. ధనవంతులు, సివిల్ సర్వెంట్లు, అధికారులు వంటి ఎందరో ప్రముఖులు కూడా ఆ విచిత్ర బాలుడిని చూసేందుకు వచ్చేవారు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు దాన్ని క్యాష్‌ చేసుకోవాలని భావించారు. విచిత్ర బాలుడికి రెండు తలల బెంగాల్‌ బాయ్‌ అనే బిరుదును ఇచ్చారు. అతన్ని చూసేందుకు వచ్చిన వారి నుండి డబ్బు వసూలు చేయటం మొదలు పెట్టారు. అందుకోసం వారు అతనిని కలకత్తాకు తీసుకువెళ్లారు. అక్కడి ప్రజలు వింత రూపంతో ఉన్న బాలుడిని చూసేందుకు వచ్చిన జనాల నుంచి డబ్బు వసూలు చేస్తూ వాడి తల్లిదండ్రులు ధనవంతులుగా మారారు. అలా ఏవరైనా డబ్బులు చెల్లించకుండా బాలుడిని చూసేందుకు వస్తే.. బెడ్‌షీట్‌లో దాచిపెట్టి చూడకుండా చేశారు. ఈ క్రమంలోనే ఆ బాలుడు నాలుగేళ్ల వయసులో మరణించినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

అయితే, వింత బాలుడు మరణించాడంటే..సహజంగా అనారోగ్య కారణం అనుకుంటారు అందరూ. కానీ, రెండు తలల బెంగాల్‌ బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు..కానీ, దురదృష్టవశాత్తు బాలుడు పాము కాటుకు గురై మరణించాడని తెలిసింది.

ఇకపోతే, బాలుడి పరిస్థితిని క్రానియోపాగస్ పారాసిటికస్ అని పిలుస్తారు. ఇది ప్రతి ఐదు మిలియన్ల పిల్లలలో ఇద్దరిని మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఈ బాలుడి పుర్రె ఇప్పుడు లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ హంటేరియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినట్టుగా సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..