వెలుగులు నింపండి సారూ.. ఈ చీకటి బతుకులు ఇంకెన్నాళ్ళు.. ఆదివాసిల అర్థనగ్న ప్రదర్శన..
Alluri Sitaramaraj District: కరెంటు సౌకర్యం కల్పించాలంటూ.. కనిపించిన వారందరినీ అభ్యర్థించారు.. కానీ ఫలితం లేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తున్న నాయకులు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. దీంతో.. ఇక చేసేది నేరుగా తమ సమస్యకు ముఖ్యమంత్రి పరిష్కారం చూపుతారని అనుకున్నారు. అర్థనగన ప్రదర్శన చేసి తమ గోడు ఆలకించాలని కోరారు.
విశాఖపట్నం, డిసెంబర్20; భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా .. చీకటి నుంచి తమకు విముక్తి కలగడం లేదని ఆ గిరిజనుల ఆవేదన చెందుతున్నారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న భూములను లాక్కునే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదు.. ప్రజా ప్రతినిధులకు మొరపెట్టిన వినే వాడే లేడు. దీంతో ఇక అర్థ నగ్న ప్రదర్శన చేశారు. నేరుగా తమ సమస్య ముఖ్యమంత్రితోనే తీరుతుంది అంటూ తమ మొర ఆలకించి సమస్య తీర్చాలంటూ వేడుకుంటున్నారు.
– అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ పరిధిలో కొండ శిఖర గ్రామాలు. బూరిగ, చిన కోనెల గ్రామాల్లో 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్లకు సూర్యాస్తమయం అయితే జీవితం అంధకారమే. ఎందుకంటే ఆ గ్రామ ప్రజలకు ఇంకా అంధకారమే. కరెంటు సౌకర్యం లేక చీకటి పడితే చాలు బిక్కు బిక్కుమంటూ ఆ జీవనమే.
– బూరిగ, చిన్నకోనిల గ్రామాల్లో కొండదొర తెగ ఆదివాసి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. కరెంటు సౌకర్యం కల్పించాలంటూ.. కనిపించిన వారందరినీ అభ్యర్థించారు.. కానీ ఫలితం లేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తున్న నాయకులు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. దీంతో.. ఇక చేసేది నేరుగా తమ సమస్యకు ముఖ్యమంత్రి పరిష్కారం చూపుతారని అనుకున్నారు. అర్థనగన ప్రదర్శన చేసి తమ గోడు ఆలకించాలని కోరారు.
– రొంపిల్లి పంచాయితీలో జురాయితీ భూమిని సర్వేనెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు 80 ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ గిరిజనులు. కానీ ఆ భూములు స్థానికేతరులకు వెళ్లిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాడేరు సబ్ కలెక్టర్ 2020 లో ఆర్ వో ఆర్ కేసులపై ఇప్పటివరకు విచారణ లేదని ఆవేదన చెందుతున్నారు. తమ భూములను లాక్కొని గ్రామాలను ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు రొంపిల్లి వార్డు సభ్యుడు అప్పలరాజు, గిరిజన సంఘం నాయకుడు పెంటయ్య.
– ఈనెల 21న చింతపల్లికి వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలపై స్పందించాలని కోరుతున్నారు. తమ భూములకు రక్షణ కల్పించి తమ గ్రామాలకు చీకటి నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..