Pawan Kalyan: ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

ఉత్తరాంధ్ర వేదికగా దోస్త్‌ మేరా దోస్త్‌ ఫ్రేమ్‌ తళుక్కుమంది. దశాబ్దం తరువాత టీడీపీ-జనసేన ఒకే వేదికను పంచుకున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. 2014 నాటి సీన్ రిపీట్ అయ్యింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత విజయనగరం పోలిపల్లిలో ఒకే ఉమ్మడి బహిరంగ సభ వేదికను పంచుకున్నారు.

Pawan Kalyan: ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
Tdp Meeting
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 20, 2023 | 9:05 PM

ఉత్తరాంధ్ర వేదికగా దోస్త్‌ మేరా దోస్త్‌ ఫ్రేమ్‌ తళుక్కుమంది. దశాబ్దం తరువాత టీడీపీ-జనసేన ఒకే వేదికను పంచుకున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. 2014 నాటి సీన్ రిపీట్ అయ్యింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత విజయనగరం పోలిపల్లిలో ఒకే ఉమ్మడి బహిరంగ సభ వేదికను పంచుకున్నారు. టీడీపీ యువగళం నవశకం బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన పొత్తు అనివార్యం. ఆవశ్యకం అన్నారు.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న తన ఆలోచన సరైందనడానికి ఉత్తరాంధ్రలో అపూర్వ స్పందనే నిదర్శమన్నారు. టీడీపీ-జనసేన పొత్తుతో ఏపీలో మార్పు రావడం ఖాయమన్నారు. బీజేపీతో అలైన్స్ గా ఉండి టీడీపీతో పొత్తుపై తనను కొందరు విమర్శిస్తున్నారన్నారు పవన్‌. టీడీపీ-జనసేన పొత్తుపై అమిత్‌షాకు కూడా చెప్పానన్నారు. ఆయన బ్లెస్సింగ్‌ కూడా కోరినట్టు చెప్పారు. ఏపీలో వైసీపిని ఓడించాలి.. జగన్‌ని ఇంటికి పంపాలంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలనుకున్నానని తెలిపారు. జగన్‌ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు.. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. సీఎం జగన్‌ని.. అంటూ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం విలువ జగన్‌కు తెలియదన్నారు. వారాహి యాత్రలో తనపై దాడులు చేశారంటూ పవన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబును జైలులో పెడితే బాధకలిగిందని వివరించారు. 2024లో టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తంచేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..