Telangana: కోతిని తప్పించబోయి అదుపుతప్పిన ఆటో బోల్తా.. ఒకరు మృతి,10మందికి గాయాలు..

కోతి అడ్డు రావడంతో ప్రమాదం జరిగిందని ఆటో డ్రైవర్ అంటున్నారు. అయితే.. ఈ ప్రాంతంలో కోతులు సంచరం అధికంగా ఉందంటూ స్థానికులు సైతం వాపోతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు సడన్ గా.. కోతులు అడ్డు రావడం తో ప్రమాదాలు జరుగుతున్నాయి.. రోడ్డు పై కోతులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అటవీ శాఖ అధికారులకు విన్నవిస్తున్నారు స్థానిక ప్రజలు, ప్రయాణికులు.

Telangana: కోతిని తప్పించబోయి అదుపుతప్పిన ఆటో బోల్తా.. ఒకరు మృతి,10మందికి గాయాలు..
Monkey
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 20, 2023 | 7:40 PM

కోతిని తప్పించబోయి.. ఆటో అదుపు తప్పింది.. రోడ్డు పై కోతి అటు.. ఇటు తిరుగుతూ ఆటో కు అడ్డువచ్చింది.. కోతి ని తప్పించ బోయిన అదుపు తప్పి బోల్తా పడింది.. సంఘటనా స్థలంలోనే ఒక్కరు మృతి చెందగా, మరో 10 మంది కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్‌ 20; వేములవాడ అర్బన్ మండలం పోశెట్టిపల్లి గ్రామంలో ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 10 మంది కూలీలకు తీవ్ర గాయలయ్యాయి. చింతలఠాణ గ్రామానికి చెందిన 11 మంది కూలీలు చందుర్తి మండలం మర్రి గడ్డ గ్రామానికి వ్యవసాయ పనికి వెళ్లారు. వారంతా కూలి పనులు ముగించుకుని తిరిగి ఆటోలో ఇంటికి బయల్దేరారు. వస్తున్న క్రమంలో పోశెట్టిపల్లి వద్ద అటోకు కోతిని అడ్డు రావడంతో కోతిని తప్పించే ప్రయత్నం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ కూలి మృతి చెందగా,10 మందికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

కోతి అడ్డు రావడంతో ప్రమాదం జరిగిందని ఆటో డ్రైవర్ అంటున్నారు. అయితే.. ఈ ప్రాంతంలో కోతులు సంచరం అధికంగా ఉందంటూ స్థానికులు సైతం వాపోతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు సడన్ గా.. కోతులు అడ్డు రావడం తో ప్రమాదాలు జరుగుతున్నాయి.. రోడ్డు పై కోతులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అటవీ శాఖ అధికారులకు విన్నవిస్తున్నారు స్థానిక ప్రజలు, ప్రయాణికులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..