AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్దరాత్రి ఎమ్మెల్యే గస్తీ.. ఖాకీలతో కలిసి కర్రలు పట్టుకుని కాపలాగా.. ఇంతకీ ఏం జరిగిందంటే..

రాత్రి, పగలు, దారిదోపిడీలతో పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. ఎవరైన కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరిగినట్లు కనిపించినా తమకు సమాచారం అందించాలని కాలనీ వాసులకు పోలీసులు సూచనలు చేశారు. అంతేకాకుండా పలు వార్డుల్లో ప్రత్యేకంగా నిఘా కొనసాగిస్తున్నారు. పగలు, రాత్రి గస్తీని పెంచారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

అర్దరాత్రి ఎమ్మెల్యే గస్తీ.. ఖాకీలతో కలిసి కర్రలు పట్టుకుని కాపలాగా.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Makhtal Mla
Boorugu Shiva Kumar
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 20, 2023 | 7:35 PM

Share

నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టస్తున్నారు. వరుస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గత 20రోజులుగా మక్తల్ పట్టణాన్ని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పక్షం రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు.. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఓ ఇంట్లో దూరి మారణాయుధాలతో తల్లి, కూతుర్లను బెదిరించి రూ.5లక్షలకు పైగా దోచుకెళ్లారు. మూడు రోజుల క్రితం జరిగిన మరో దారి దోపిడి మరింత భయకంపితుల్ని చేస్తోంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని అడ్డుకొని… గొంతుకు తాడును బిగించి 30వేల రూపాయలను దోచుకెళ్లారు. వరుస చోరిలతో మక్తల్ పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దొంగలు పగలు, రాత్రి తేడా లేకుండా దోపిడీలకు పాల్పడుతూ సంచలనం సఈష్టిస్తున్నారు. ఇళ్లు వదిలి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వరుస దొంగతనాల నేపథ్యంలో అదిగో దొంగలు అంటే ఇదిగో దొంగలు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పలు కాలనీల్లో యువకులు సైతం కర్రలు పట్టుకొని గస్తీ కాస్తున్నారు.

ఇక దొంగలను పట్టుకునేందుకు తానే స్వయంగా వస్తానని ఇటివలే ఎమ్మెల్యే ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. అటూ కాలనీల్లో గస్తీ పెంచాలని పోలీసులకు సైతం సూచించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మక్తల్ పట్టణంలో గస్తీని పెంచారు. రాత్రిళ్లు పోలీసులంతా పట్టణంలోని కాలనీల్లో నిఘా పెంచారు. ఇక పోలీసులతో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సైతం గస్తీలో పాల్గొన్నారు. రాత్రి గం.11.30నిమిషాల తర్వాత నుంచి తెల్లవారుజామున గం.2.40నిమిషాల వరకు టౌన్ లోని పలు కాలనీల్లో పోలీసులతో కలిసి గస్తీ తిరిగారు. పోలీసులతో పాటుగా కర్ర పట్టుకొని తిరిగారు. ఆయా కాలనీల్లో ప్రజలను కలిసి భరోస కల్పించారు. ప్రజల భయాందోళనలు పోగెట్టేందుకు పోలీసులతో కలిసి ఎమ్మెల్యే గస్తీ తిరగడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి, పగలు, దారిదోపిడీలతో పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. ఎవరైన కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరిగినట్లు కనిపించినా తమకు సమాచారం అందించాలని కాలనీ వాసులకు పోలీసులు సూచనలు చేశారు. అంతేకాకుండా పలు వార్డుల్లో ప్రత్యేకంగా నిఘా కొనసాగిస్తున్నారు. పగలు, రాత్రి గస్తీని పెంచారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..