Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అడవి గుండా వెళ్తున్న కారుపై హఠాత్తుగా ఏనుగు దాడి..! భలే తప్పించుకున్నారుగా..

ఈ వీడియోపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఏనుగుకు బాగా ఆకలిగా ఉందేమోనంటూ చాలా మంది కామెంట్‌ చేశారు. ఏది ఏమైనా కారులో ప్రయాణిస్తున్న ఫ్యామిలీకి ఈ నేలపై నూకలు మిగిలి ఉన్నాయి.. కాబట్టే, ఏనుగు ఎలాంటి దాడి చేయకుండా వారిని విడిచిపెట్టిందంటూ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యనించారు. వీడియోపై లైకులు, కామెంట్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

Viral Video: అడవి గుండా వెళ్తున్న కారుపై హఠాత్తుగా ఏనుగు దాడి..! భలే తప్పించుకున్నారుగా..
Elephant Smashes Van
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 20, 2023 | 6:41 PM

ఏనుగు ఒక శక్తివంతమైన, ప్రత్యేకమైన అడవి జంతువు. దీని శక్తి ముందు సింహాలు కూడా నమస్కరిస్తాయి. అలాంటి ఏనుగు అడవి గుండా వెళ్తున్న ఓ కారుపై దాడి చేసి దోచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. కొంతమంది పర్యాటకులు ఒక కారులో అడవి గుండా ప్రయాణిస్తుండగా, చెట్ల పొదల్లోంచి హఠాత్తుగా బయటకు వచ్చిన ఏనుగు వారి వాహనంపై ఎలా దాడి చేసిందో చూపించే వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో శ్రీలంకలోని యాలా నేషనల్ పార్క్‌కి చెందినదిగా తెలిసింది. ఇది చూసిన ఇంటర్నెట్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కారులో కొంతమంది పర్యాటకులు అడవి గుండా వెళుతున్నారు. కారు ఇంకొంచెం ముందుకు వెళుతుండగా, దారి మధ్యలో కారుకు ఎదురుగా అడవిలోంచి ఒక భారీ ఏనుగు ప్రత్యక్షమైంది. సడెన్‌గా ఎంటర్‌ అయిన ఏనుగును చూసిన కారు డ్రైవర్ గేర్లు మారుస్తూ కారును ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ, అప్పటికే ఆ ఏనుగు కారు అద్దాలను పగులగొట్టింది.. కిటీకిలోంచి తొండం కారులోకి పెట్టి కారును ఆపింది. దాంతో కారు ఇంచు కూడా ముందుకు కదలలేదు. ఏనుగు కారులో ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని వెతుకుతుంది.

ఇవి కూడా చదవండి

నిజానికి, ఏనుగు కిటికీలోంచి తొండం లోపలికి పెట్టగానే కారులో ఆహార పదార్థాల వాసన వస్తుంది. దాని తొండంతో కారులో ఉన్న వస్తువులను వెతకడం ప్రారంభిస్తుంది. ఏనుగు వెతకటం చూసి కారులో ఉన్న పిల్లవాడితో పాటు వెనుక సీట్లో కూర్చున్న ఒక మహిళ వారి వద్దనున్న ఫ్రెంచ్ ఫ్రైస్‌ని కిటికీలోంచి బయటకు విసిరేసారు. కానీ, అప్పటికే కారులో తొండంతో ఆహారం వెతుకుతున్న ఏనుగు ఎట్టకేలకు తన ట్రంక్ బయటకు తీస్తుంది. దీంతో సెకన్ల వ్యవధిలోనే ఆ డ్రైవర్ వీలైనంత వేగంగా కారును ముందుకు పోనిచ్చాడు. దాంతో కారులో ఉన్నవారంతా ఓ మై గాడ్‌ అనడం వినిపిస్తోంది. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది.

View this post on Instagram

A post shared by Iraj (@irajw)

ఈ వీడియోపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఏనుగుకు బాగా ఆకలిగా ఉందేమోనంటూ చాలా మంది కామెంట్‌ చేశారు. ఏది ఏమైనా కారులో ప్రయాణిస్తున్న ఫ్యామిలీకి ఈ నేలపై నూకలు మిగిలి ఉన్నాయి.. కాబట్టే, ఏనుగు ఎలాంటి దాడి చేయకుండా వారిని విడిచిపెట్టిందంటూ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యనించారు. వీడియోపై లైకులు, కామెంట్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..