AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari : డ్రైవర్ లెస్ కార్లను భారత్ లోకి అనుమతించబోం..! మరోమారు తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి..

అయితే, టెస్లాను భారతదేశానికి రావడానికి అనుమతిస్తామని గడ్కరీ చెబుతూనే.. వాటిని చైనాలో ఉత్పత్తి చేయడానికి, భారతదేశంలో విక్రయించడానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అలా చేయడం అసాధ్యమన్నారు. హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనం, ప్రజా మౌలిక సదుపాయాలను పెంచడంలో సహాయపడటానికి తాము అత్యుత్తమ సాంకేతికతను తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు.

Nitin Gadkari : డ్రైవర్ లెస్ కార్లను భారత్ లోకి అనుమతించబోం..! మరోమారు తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి..
Nitin Gadkari
Jyothi Gadda
|

Updated on: Dec 20, 2023 | 3:28 PM

Share

డ్రైవర్ లెస్ కార్ల పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ రహిత కార్లను భారత్ లోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. రోడ్డు భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం నాగ్‌పూర్‌లో నిర్వహించిన ‘జీరో మైల్ సంవాద్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్రం తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు. దేశంలోని రహదారి భద్రతా సమస్యల గురించి సమాచారాన్ని అందించారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఇన్‌స్టాల్ చేయడం, రోడ్లపై బ్లాక్ స్పాట్‌లను తగ్గించడం, ఎలక్ట్రిక్ మోటార్స్ చట్టం ద్వారా జరిమానాలను పెంచడం వంటి మార్పుల గురించి కూడా ఆయన తెలియజేశారు.

ఎలక్ట్రిక్ మోటార్స్ చట్టం ద్వారా జరిమానాను పెంచామన్నారు. అంబులెన్స్‌లు, క్రేన్‌లను సిద్ధంగా ఉంచారు. దీంతో అంతా సాఫీగా సాగుతుంది. రోడ్డు భద్రతకు సంబంధించి ప్రతి సంవత్సరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని గడ్కరీ తెలిపారు. అదే సమయంలో డ్రైవర్‌లేని కార్లు భారతదేశంలోని రోడ్లపై ఎప్పటికీ దిగవని గడ్కరీ స్పష్టం చేశారు.

భారతదేశంలో డ్రైవర్ లెస్ కార్లను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. దీని వల్ల డ్రైవర్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్‌ లెస్‌ కార్లు భారత్‌కు రావడానికి తాను ఎప్పుడూ అనుమతించనని అన్నారు.. ఎందుకంటే ఇది ఎంతో మంది డ్రైవర్లను రోడ్డున పడవేస్తుంది. వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తుంది. అందుకే డ్రైవర్‌ లెస్‌ కార్లకు అనుమతించమని గడ్కరీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

అయితే, టెస్లాను భారతదేశానికి రావడానికి అనుమతిస్తామని గడ్కరీ చెబుతూనే.. వాటిని చైనాలో ఉత్పత్తి చేయడానికి, భారతదేశంలో విక్రయించడానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అలా చేయడం అసాధ్యమన్నారు. హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనం, ప్రజా మౌలిక సదుపాయాలను పెంచడంలో సహాయపడటానికి తాము అత్యుత్తమ సాంకేతికతను తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు.

ఇటీవల, కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా నితిన్‌ గడ్కరీ పార్లమెంటులో మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై మూలధన వ్యయం 2013-14లో సుమారు రూ.51,000 కోట్ల నుండి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,40,000 కోట్లకు పెరిగిందన్నారు. రోడ్డు మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2013-14లో సుమారు రూ.31,130 కోట్ల నుండి 2023-24 నాటికి రూ.2,70,435 కోట్లకు పెరిగాయని ఆయన చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..