చలికాలంలో గోధుమ రొట్టెల కంటే జొన్న రొట్టెలు తింటే ఆరోగ్యానికి మంచిది. జొన్నల్లో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ప్రోటీన్, విటమిన్-బి, కాంప్లెక్స్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇలాంటి జొన్నలు మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి. జొన్న రొట్టె తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది. అలాగే ఎన్నో వ్యాధుల ముప్పు తప్పుతుంది.