ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన పరాటా మేకింగ్ వీడియోపై… అభిషేక్‌ బచ్చన్‌ స్పందించారు..ఏమన్నారంటే..

తర్వాత ఒక పెద్ద సైజున్న బౌల్‌లో దానికి కావాల్సిన స్టఫ్‌ను నింపాడు. మళ్లీ కర్రతో గుడ్రంగా పరాటను తయారు చేశాడు..ఆ తర్వాత జాగ్రత్తగా తీసి పాన్‌పై బాగా కాల్చాడు..ఈ పరాటాను చిన్న ముక్కలుగా కోసిన తర్వాత చట్నీతో వడ్డిస్తారు. ఒక పెద్ద గిన్నెలో పెరుగు కూడా సర్వ్‌ చేస్తారు. భోజన ప్రియులు ఇలాంటి పరాటాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ప్రస్తుతం ఈ భారీ పరాట వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన పరాటా మేకింగ్ వీడియోపై... అభిషేక్‌ బచ్చన్‌ స్పందించారు..ఏమన్నారంటే..
Paratha Making
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 20, 2023 | 9:35 PM

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో అతనికి 10.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రెండింగ్ టాపిక్స్‌పై అతను క్రమం తప్పకుండా ఇక్కడ పోస్ట్ చేస్తుంటారు. ఆకర్షణీయమైన కథనాలకు సంబంధించిన పోస్ట్‌లు అనేకం ఉంటాయి. తాజాగా పరాటా మేకింగ్ వీడియోను షేర్ చేశారు ఆనంద్‌ మహీంద్ర. వీడియోలో అతి పెద్ద సైజున్న పరాటా తయారు చేయడం మనం చూడొచ్చు. వీడియో క్యాప్షన్‌లో మీకు ఇలాంటి పరాఠా ఉన్నప్పుడు పిజ్జా ఎవరికి కావాలి..?’ అంటున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్‌పై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా స్పందించారు. పోస్ట్‌ క్యాప్షన్‌కు అతను రిప్లై ఇస్తూ..అవునని అన్నారు. వీడియో ప్రారంభంలో మీరు పాన్‌పై పెద్ద సైజు పరాటా తయారు చేయడం మనం చూడొచ్చు. ఇందులో మొదట పిండితో పెద్ద రోటీని తయారు చేశాడు.. ఆ తర్వాత ఒక పెద్ద సైజున్న బౌల్‌లో దానికి కావాల్సిన స్టఫ్‌ను నింపాడు. మళ్లీ కర్రతో గుడ్రంగా పరాటను తయారు చేశాడు..ఆ తర్వాత జాగ్రత్తగా తీసి పాన్‌పై బాగా కాల్చాడు..ఈ పరాటాను చిన్న ముక్కలుగా కోసిన తర్వాత చట్నీతో వడ్డిస్తారు. ఒక పెద్ద గిన్నెలో పెరుగు కూడా సర్వ్‌ చేస్తారు. భోజన ప్రియులు ఇలాంటి పరాటాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ప్రస్తుతం ఈ భారీ పరాట వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో పోస్ట్ చేసిన నుండి 1.1 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. 24 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా వీడియోపై కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా అన్నారు, ‘నేను వివిధ రకాల పరాఠాల గురించి 100 శాతం అనుకుంటున్నాను. ఇది బంగాళదుంపలు, జున్ను, క్యాబేజీ, కాయధాన్యాలు, క్యాబేజీ మరియు కూరగాయలతో తయారు చేశారు..మసాలా తడ్కాతో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలంటూ కొందరు సలహాలు, సూచనలు కూడా చేస్తున్నారు. మొత్తంగా వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..