ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఎందుకు అంటారో తెలుసా..? ఇలా చేస్తే..

బంగాళాదుంపలతో ఉల్లిపాయలను నిల్వ చేయవద్దు. ఎందుకంటే రెండూ త్వరగా మొలకెత్తుతాయి. చెడిపోతాయి. ఉల్లిపాయలను ప్లాస్టిక్ సంచులలో చుట్టి లేదా ప్లాస్టిక్ బాక్సులలో సీలు చేయకూడదు. ఒలిచిన లేదా తరిగిన ఉల్లిపాయలను రిఫ్రిజిరేటర్‌లో ప్లాస్టిక్ కంటైనర్‌లో నిల్వ చేయవచ్చు. ఉల్లిపాయల్ని మార్కెట్లో అమ్మేటప్పుడు వ్యాపారులు వాటిని గోనె సంచి, జనపనార సంచుల్లో నిల్వ చేస్తారు.

ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఎందుకు అంటారో తెలుసా..? ఇలా చేస్తే..
Onion
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 20, 2023 | 9:07 PM

రోజూ వండుకునే వారికి సాధారణంగా ఉల్లితో కలిపి కొని కూరగాయలను నిల్వ ఉంచుకుంటారు. కానీ, అలా చేయటం తప్పు.సాధారణంగా ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఎంత చక్కగా నిల్వ ఉంచడానికి ప్రయత్నించినా చాలా వరకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. అలా కాకుండా ఎక్కువ కాలం పాటు ఉల్లిపాయలు నిల్వ ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ అనేది రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడని ఆహారాలు, కూరగాయ అని చాలా మందికి తెలుసు. అయితే ఈ విషయం తెలియని వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఎందుకు అంటారో కూడా మనకు తెలుసు.

ఉల్లిపాయలు పొరలు పొరలుగా కరకరలాడే సహజమైన వంటకం. అలాడే ఇది పొడిగా ఉండాలి. ఉల్లిపాయ తడిస్తే పాడైపోతుంది. ఫ్రిజ్ లోపల చల్లటి వాతావరణంలో నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు లేదా పండ్లను నిల్వచేయటం అవసరం. కానీ, ఉల్లిపాయలు వంటి నేలలో పెరిగిన ఆహార పదార్థాలను నిల్వ చేసేటప్పుడు కూడా వాటికి తగిన స్థలం అవసరం. లేదంటే పాడైపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్ లోపల వెలుతురు కూడా ఉల్లిపాయలకు మంచిది కాదు. ఉల్లిపాయలను నీడ. కేవలం చల్లని పొడి ప్రదేశంలో మాత్రమే నిల్వ చేయాలి.

చెడిపోయిన ఉల్లిపాయలు రుచిలో తేడాను తీసుకురావడమే కాకుండా, కడుపుకు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ఇది వికారం, గుండెల్లో మంట, అదనపు గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఉల్లిపాయను పాడవకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. ముందే చెప్పినట్లుగా ఉల్లిపాయలను పొడిగా, కొద్దిగా చల్లగా (ఫ్రిడ్జ్ అంత కాదు) బాగా వెంటిలేషన్ ఉండే ప్రదేశంలో ఉంచాలి. ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉండాలంటే వాటిని చల్లని, గాలి వచ్చే ప్రదేశంలో పెట్టాలి. వీలైతే వాటిపై పేపర్‌తో కవర్ చేయండి. దీంతో త్వరగా మొలకెత్తవు.

ఇవి కూడా చదవండి

బంగాళాదుంపలతో ఉల్లిపాయలను నిల్వ చేయవద్దు. ఎందుకంటే రెండూ త్వరగా మొలకెత్తుతాయి. చెడిపోతాయి. ఉల్లిపాయలను ప్లాస్టిక్ సంచులలో చుట్టి లేదా ప్లాస్టిక్ బాక్సులలో సీలు చేయకూడదు. ఒలిచిన లేదా తరిగిన ఉల్లిపాయలను రిఫ్రిజిరేటర్‌లో ప్లాస్టిక్ కంటైనర్‌లో నిల్వ చేయవచ్చు. ఉల్లిపాయల్ని మార్కెట్లో అమ్మేటప్పుడు వ్యాపారులు వాటిని గోనె సంచి, జనపనార సంచుల్లో నిల్వ చేస్తారు. అలా అయితేనే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అందుకే, ఉల్లిపాయల్ని స్టోర్ చేసేందుకు జ్యూట్ బ్యాగ్ బెస్ట్ అని చెప్పొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..